News and Entertainment

రష్మీపై వ్యభిచార పుకార్లు!

హాట్‌ యాంకర్‌ రష్మీ జబర్దస్త్‌ను తన అందాలతో ఎక్కడికో తీసుకు వెళ్లింది. జబర్దస్త్‌ సక్సెస్‌కు ఒక కారణం రష్మీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తన అందాలతో పాటు తన ముద్దుముద్దు మాటలతో కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూసేలా ఆకర్షించింది. అది భారీ విజయం అవ్వడంతో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈమె పలు చిత్రాల్లో నటించింది. అందులో ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించలేక పోయింది. అయినా కూడా రష్మీ ఇంకా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడిపై వ్యభిచారం చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.


ఈ విషయాన్ని స్వయంగా రష్మీ చెప్పుకొచ్చింది. తాను వ్యభిచారం చేస్తున్నాను అంటూ మీడియాలో కొన్ని రోజుల క్రితం ఒక వార్త చూశాను. అప్పుడు నాకు ఎంతో బాధ వేసింది. కాని ఆ తర్వాత లైట్‌ తీసుకున్నాను. నా గురించి ఎంత చెత్త వార్త వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోను అని చెప్పుకొచ్చింది. ఇక సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారంపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ తనకు ఎలాంటి ఉద్దేశ్యం లేదు అని, మీడియాలో వస్తున్న వార్తలపై పెద్దగా స్పందించను అంటూ చెప్పుకొచ్చింది. దేనిపైనా క్లారిటీ ఇవ్వకుండానే మీడియాపై ఈమె మండిపడ్డది. ప్రస్తుతం ఈమె రెండు చిత్రాల్లో హాట్‌ హాట్‌గా నటిస్తూ ఉంది.