News and Entertainment

ప్రేమించిన అమ్మాయి నగ్న చిత్రాలను వాట్సాప్ లో పెట్టి.. ఆ తరువాత..


ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. రోజురోజుకి ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా జరిగే నేరాల సంఖ్య పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఫేస్ బుక్ లో, వాట్సప్ లో నగ్న ఫోటోలు పోస్ట్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ప్రేమంటే ఒకరొకరు బ్రతకడం.. కుదరకపోతే ఒకరిని విడిచి ఒకరు బ్రతకడం అంతే కానీ ప్రేమించిన అమ్మాయి మాన-ప్రాణాలని తియ్యడం కాదు. కానీ ఒక నీచుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నగ్న ఫోటోలను వాట్సాప్ లో పెట్టి రాక్షస ఆనందం పొందాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..
ప్రేమించిన అమ్మాయి నగ్న చిత్రాలను వాట్సాప్ లో అప్ లోడ్ చేసిన యువకుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ పెండ్యాల ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు...

కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామానికి చెందిన కుంటాలపల్లి నరేష్ తన సెల్ ఫోన్ లో అదే గ్రామానికి చెందిన అమ్మాయి నగ్న చిత్రాలను వాట్సాప్ మెసెంజర్ ద్వారా పలు గ్రూపులకు అప్ లోడ్ చేశాడు.

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం ఉదయం నిందితుడిని లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి పిలిపించి నిలదీశారు. ఫోటోలు తానే తీశానని, వాట్సాప్ లో మాత్రం అప్ లోడ్ చేయలేదన్నాడు. దీంతో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు నరేష్ ను ఆలయం నుంచి గ్రామపంచాయతీ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, తగిన శాస్తి చేసి పోలీసులకు అప్పగించాలని భావించారు.