News and Entertainment

ప్రేమ కోసం 17 ఏళ్ల యువతి రేప్‌ డ్రామా


బెంగళూరుకు చెందిన 17 సంవత్సరాల యువతి తాను ప్రేమించిన వ్యక్తిని దక్కించుకునేందుకు కిడ్నాప్ మరియు రేప్ డ్రామా ఆడటం జరిగింది. 18వ సంవత్సరంలో తన తల్లి పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె తన ప్రియుడితో కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. 18 సంవత్సరాల ఫర్హాన్ను ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. తన ప్రేమను దక్కించుకునేందుకు రేప్ డ్రామా ఆడాలని, అందుకు ఫర్హాన్ మరియు అతడి స్నేహితుడి హెల్ప్ కూడా తీసుకుంది.


ఒక రోజు ఆ అమ్మాయి మద్యాహ్నం బయటకు వెళ్లి మద్యరాత్రి 2 గంటల సమయంలో వచ్చింది. అప్పటికే తమ కూతురు కనిపించడం లేదు అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఎంక్వౌరీ మొదలు పెట్టారు. అర్థరాత్రి రెండు గంటలకు వచ్చిన ఆ అమ్మాయిని పోలీసులు ప్రశ్నించారు. తనను ఎవరో కార్లో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు అని, ఆపై తనపై అత్యాచారం చేశారు అని చెప్పుకొచ్చింది. ఆమె చెబుతున్న వివరాలు సరిగా లేవు అని భావించిన పోలీసులు రహస్యంగా ఆమెను మరింత లోతుగా ఎంక్వౌరీ చేశారు. దాంతో అసలు విషయం బయట పడ్డది. రేప్కు గురి అయిన తనను ఎవరు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రారు. ఆ సమయంలో తాను ఫర్హాన్ను పెళ్లి చేసుకోవచ్చు అని ఇలా డ్రామా ఆడాను అని చెప్పుకొచ్చింది. దాంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈమె చేసిన పనికి ఫర్హాన్తో పాటు అతడి స్నేహితుడు జైలు పాలు అయ్యారు.