News and Entertainment

ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ పని చెయ్యవచ్చా.. చెయ్యకూడదా.. తప్పక తెలుసుకోండి



దేవుడికి ఉపవాసం ఉండటం అంటే దేవునికి దగ్గరగా ఉండటం అని అర్ధం. ఉపవాసం అంటే అర్ధం ఏమిటంటే....ఉప అంటే సమీపం అని,వాసం అంటే నివసించటం అని అర్ధం. అయితే లోకంలో ఉపవాసం అంటే తిండి తినకుండా ఉండటం అని స్థిరపడిపోయింది. దేవునికి సమీపంలో ఉండటానికి చేసిన ప్రక్రియ రాను రాను తిండికి సంబందించిన నియమంగా స్థిరపడిపోయింది.

అయితే సైన్స్ ప‌రంగా చెప్పాలంటే ఉప‌వాసం ఉండ‌డం మ‌న శ‌రీరానికి మంచిదే. దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు విశ్రాంతి దొరుకుతుంది. ఈ క్ర‌మంలో ప‌లు రుగ్మ‌త‌లు కూడా వాటంత‌ట అవే న‌యం అయిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఉప‌వాసం ఉన్న స‌మ‌యంలో చేయ‌కూడ‌ని (లేదా చేసే) ఓ పని గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అదే ర‌తి క్రీడ‌. అవును, షాకింగ్‌గా ఉన్నా, మీరు వింటోంది క‌రెక్టే. ఉప‌వాసం ఉన్న‌ప్పుడు అస‌లు ర‌తిక్రీడ చేయ‌వ‌చ్చా..?

ఆరోగ్య పరంగా ఉపవాసం చెయ్యడం చాలా మంచిది. కాని ఉపవాసం చేసిన తరువాత శృంగారం చెయ్యడం అనేది చాలా కష్టతరమైన పని. అవునండీ ఇది నిజం. ఖాళీ కడుపుతో సెక్స్‌లో పాల్గొన్న మహిళల కంటే సుష్టుగా భోజనం చేసిన స్త్రీలు శృంగారంలో యాక్టివ్‌ పార్ట్‌ తీసుకుంటారట. మానవ మెదడు సాధారణంగా డబ్బు, ఆహారం, సెక్స్‌ వంటి విషయాల్లో పొందినంత ఉత్తేజం మరే ఇతర విషయాల్లోనూ పొందదట. ఈ విషయాన్ని పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్‌ అలీస్‌ ఎలే వెల్లడించారు.


ఈ ప్రయోగం కోసం ఆమె ఎనిమిది గంటల నుంచి ఉపవాసం చేస్తున్న మహిళల బ్రెయిన్‌ స్కాన్‌ చేశారట. అందులో ‘న్యూట్రల్‌’ ఇమేజస్‌ ఎక్కువగా కనబడ్డాయట. అలాగే 500 కిలో కేలరీల న్యూట్రీషన్‌ సప్లిమెంట్‌ డ్రింక్‌ ఇచ్చిన తర్వాత తీసిన బ్రెయన్‌ స్కాన్‌లో వేరే ఇమేజ్‌లు కనబడ్డాయట. గంటలపాటు ఉపవాసం చేసిన వారి మెదడు శృంగారం గురించి అసలు ఆలోచించనే లేదట. అలాగే విపరీతంగా ఆహారం తీసుకున్నా మెదడులో శృంగార భావనలు మొలకెత్తవట. కాబట్టి మితంగా ఆహారం తీసుకుంటే సెక్స్‌ లైఫ్‌ కూడా అద్భుతంగా ఉంటుందని ఆమె తెలిపారు.