News and Entertainment

చూడడానికి సాధారణ గృహిణి.! నిజం తెలిస్తే షాకే..!


అమాయకులుగా కనిపించేవారంతా నిజానికి అమాయకులు కాదు అని మరోసారి తేలింది. చూడడానికి సాధారణ గృహిణిలా కనిపించిన సుష్మిత అనే మహిళ పోలీసులకు షాక్ ఇచ్చింది. విలాసవంతమైన భవంతిలో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతు... కోట్లల్లో అక్రమ దందా చేస్తుంది. ఆమె భర్త ఓ సాధారణ డ్రైవర్. కానీ సుష్మిత మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రాజస్థాన్‌ లో అతిపెద్ద రాకెట్ నడుపుతోంది.

రెండు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు ఓపియం (నల్లమందు) స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు అనుమానించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారించగా... జోధ్‌ పూర్‌ కి చెందిన సుష్మిత అనే మహిళ ఓ పెద్ద డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నెట్‌-వర్క్‌ నే నడుపుతోందని తేలింది. సుష్మిత ను అరెస్ట్ చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. సుష్మిత నివసిస్తున్న బొరానాడా ప్రాంతంలోని నాలుగంతస్తుల బిల్డింగులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 76 గ్రాముల ఓపియం, సిస్టమేటిక్‌ జీపీఎస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఖరీదైన కార్లు కనిపించేసరికి పోలీసులు అవాక్కయ్యారు.


సుష్మిత ఆరేళ్ల క్రితం తన భర్తతో కలిసి జోధ్‌ పూర్‌ కి వచ్చింది. భర్తకు కర్ణాటకలో డ్రైవర్‌ గా మంచి ఉద్యోగం దొరకడంతో అతను వెళ్లిపోయాడు. ఈ సమయంలో సుష్మితకు రాజురామ్‌ ఇక్రాం అనే వ్యక్తితో మంచి పరిచయం ఏర్పడింది. అతడు మద్యం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ చేస్తుంటాడు. సుష్మితకు డబ్బు ఆశ బాగా ఉందని గ్రహించిన రాజురామ్.. ఆమెను మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ లో దించాడు. రాజురామ్‌ దందాను ఏడాది పాటు గమనించిన సుష్మితకు స్మగ్లింగ్‌ ఎలా చేయాలో బాగా తెలిసింది. 2015లో రాజురామ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు దొరికిపోవడంతో ఆ దందాని సుష్మిత కొనసాగించింది. నల్లమందు ఎక్కువగా పండే మధ్యప్రదేశ్‌, చిట్టోరాగడ్‌ ప్రాంతాల నుంచి కొన్ని కోట్లు ఖరీదైన ఓపియంను ఎన్నో దేశాలకు స్మగ్లింగ్‌ చేసేది. ఈ వ్యాపారంలోకి కుటుంబ సభ్యులను కూడా దించింది. పోలీసులు సుష్మితతో పాటు మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.