News and Entertainment

'సాయిబాబా పేరిట ఒక భూతాన్ని పూజిస్తున్నారు'


ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరో సారి షిర్డి సాయిబాబాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లలితకళా తోరణంలో నిర్వహిస్తున్న ‘గురువందనమ్’ కార్యక్రమంలో స్వరూపానంద పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానంద మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ప్రతి ఇంట్లో సాయి పేరిట ఒక భూతాన్ని పూజిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


'సాయిని దేవుడంటూ మమ్మల్ని మూర్ఖుల్ని చేయకండి. సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకోవద్దు. సంతోషిమాత వచ్చేసింది. వినాయకుడు పాలు తాగుతున్నాడన్న నమ్మకాలతో సనాతన ధర్మం పరువు తీయకండి' అంటూ స్వరూపానంద అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై సాయిభక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. సాయిభక్తులను పోలీసులు అరెస్టు చేశారు.