News and Entertainment

ప్రముఖ డైరెక్టర్ వేధింపులు.. హీరొయిన్ ఆత్మహత్య


ఎన్ని చట్టాలున్నా.. నిర్భయ యాక్ట్ను ప్రవేశపెట్టినా మహిళలపై వేధింపులు మాత్రం ఆగట్లేదు. నిత్యం ఎక్కడో..ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. సినీ ఇండస్ట్రీలోనూ అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశ సినీపరిశ్రమలో సినీ హీరోయిన్లకు తీవ్రమైన వేధింపులు ఉంటాయనే విమర్శల్లో మరో కోణం తెరమీదకు వచ్చింది. చిత్రపరిశ్రమ ద్వారా సత్తా చాటుకునేందుకు ఎన్నో కలలతో వచ్చిన ఓ సినీ నటి దర్శకుడి చేతుల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురై ఏకంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆ సినీ నటి పేరు అదితి అకా అతిర సంతోష్ కాగా..ఆ తమిళనాడు దర్శకుడి పేరు సెల్వకన్నన్.


సినిమా మొదలైన నాటి నుంచి సెల్వకన్నన్ తనను వేధిస్తున్నాడని చెప్పింది. పదేపదే సెల్వ కన్నన్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, ప్రేమను నిరాకరిస్తే బెదిరించేవాడని తెలిపింది. అతడి ప్రేమను తిరస్కరించినప్పట్నుంచి సెల్వకన్నన్ వేధింపులు ఎక్కువయ్యాయని, ఓ సారి తనను గదిలో కూడా నిర్బంధించాడని విలపించింది. ఎలాగోలా తప్పించుకుని కేరళలోని తన ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. దానిపై అటు పోలీసులకు, నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. తాను నడిగర్ సంఘంలో సభ్యురాలిని కానందువల్ల తన ఫిర్యాదు తీసుకోబోమని నడిగర్ సంఘం చెప్పినట్టు అదితి వివరించింది. అయితే.. ఇటీవల ఓ ప్రకటన షూటింగ్ కోసం చెన్నైకి వచ్చానని, ఆ షూటింగ్ స్పాట్కు కొంతమంది వ్యక్తులతో వచ్చిన సెల్వకన్నన్.. తనను శారీరకంగా హింసించాడని, లైంగికంగా వేధించాడని, తనతలను గోడకేసి బాదాడని విలపించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించినట్లు వివరించింది. అందుకే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వెల్లడించింది.