News and Entertainment

షాకింగ్‌ : మగాడికి అండాశయం, యోగి, గర్బాశయం



చరిత్రలోనే అరుదైన ఆపరేషన్‌ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్లు నిర్వహించారు. 16 సంవత్సరాల ఒక యువకుడికి ఉన్న అండాశయం, గర్బాశయం, యోనిలను తొలగించారు. ఇలాంటి ఆపరేషన్‌ ప్రపంచంలో ప్రధమంగా జరిగినట్లుగా సదరు డాక్టర్లు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే... పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన 16 సంవత్సరాల వ్యక్తి అనారోగ్య కారణంతో డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. స్కానింగ్‌ చేసిన డాక్టర్లు అతడు మహిళ అవయవాలను కలిగి ఉన్నాడు అని నిర్థారించారు.


ఇలాంటి అరుదైన కేసులు ప్రపంచంలో కేవం పది మాత్రమే ఉన్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు. వారి కుటుంబ సభ్యుల ఒప్పందం మేరకు రెండు దశల్లో అతడికి ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించడం జరిగింది. అతడిలో ఉన్న అండాశయం మరియు గర్బాశయం అచ్చు ఆడువారిలో ఉన్న వాటి మాదిరిగానే ఉన్నాయి. ఇక యోని ఉంది కాని బయటకు లేకుండా మూసుకు పోయి ఉంది. దాంతో ఈ మూడు అవయవాలను డాక్టర్లు రెండు సార్లు ఆపరేషన్‌ చేసి విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయి మగాడిగా ఆ వ్యక్తిని మార్చినట్లుగా డాక్టర్లు ప్రకటించారు.