News and Entertainment

వేశ్య గా మారిన ప్రముఖ చెల్లెలు పాత్ర దారి .. ఒక రాత్రికి ఎంతంటే?


ఈమధ్య ఇండస్ట్రీలో ప్రాస్టిట్యూషన్ వ్యవహారాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఆఫర్లు రాక కొంతమంది తారలు ఆ దిశగా అడుగులువేస్తే.. మరికొందరు బోలెడన్ని ఆఫర్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ తమ కామ కోరికలు తీర్చుకోవడంతోపాటు ఇంకా డబ్బులు సంపాదించాలనే ఆశతో వ్యభిచారం రొంపిలోకి దూకుతున్నారు. అయితే.. వీళ్ళలో చాలామంది రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. తాజాగా మరో నటి అడ్డంగా బుక్కైంది.

ఆ నటి పేరు, ఇతర వివరాలు తెలియజేసేందుకు పోలీసులు నిరాకరించారు కానీ.. ఆమె చాలా పాపులర్ అని తెలిసింది. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివనిస్తున్న ఆ నటి.. ఇప్పటివరకు చాలా సినిమాల్లో చెల్లెలు పాత్రలో నటించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఈమె టాలెంట్‌కి మురిసిపోయి దర్శకనిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇచ్చారు. కానీ.. ఇప్పుడు కొత్తవాళ్ళ హవా ఎక్కువగా కొనసాగుతుండడంతో ఆమెకి ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడైతే మరీ తక్కువ అయిపోవడంతో ఆ నటికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అవకాశాలకోసం కొన్నాళ్ళు కష్టపడింది కానీ.. ఫలితం దక్కలేదు. దాంతో.. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుని ఆమె ఇలా వ్యభిచారంలోకి దిగిందని తెలుస్తోంది.


ఓ ఆన్‌లైన్ బ్రోతల్ సైట్ ద్వారా ఆ నటి సెక్స్ వర్కర్‌గా మారినట్లు విచారణలో ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె ఒక రాత్రికి 5 నుంచి 6 లక్షల మేర డిమాండ్ చేసేదని, బడాబాబుల నుంచి రూ.10 లక్షలకుపైగా డబ్బులు వసూలు చేసేదని వారు పేర్కొన్నారు. రీసెంట్‌గా టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో ఈ నటి పట్టుబడింది. ఈ నటిని చూసి తాము షాక్ తిన్నట్లు పోలీసులు అన్నారు.