News and Entertainment

జియో సిమ్‌ తీసుకునే వారికీ హెచ్చరిక..


రిలయన్స్ జియో…… ప్రస్తుత టెలికామ్ రంగంతో పాటుగా దేశంలోనే ఒక పెను ప్రభంజనం సృష్టించింది. జియో ఇచ్చిన ఆఫర్లు ఇంక ఏ ఇతర కంపెనీలు ఇవ్వలేదు. అయితే అన్ని ఇతర కంపెనీల లాగ ఈ సిమ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కేవలం రిలయన్స్ డిజిటల్ ఎక్సప్రెస్, డిజిటల్ ఎక్సప్రెస్ మినీ మరియు ఎంపిక చేసిన స్టోర్లలో మాత్రమే లభ్యమౌతుంది. కానీ ఇప్పటికే ఆ సిమ్ కోసం ఎందరో కస్టమర్లు స్టోర్ల వద్ద బార్లు తీశారు.
అయితే రిలయన్స్‌ జియో సిమ్‌లను కొన్ని వెబ్‌సెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సిమ్ ల కోసం చేయాల్సిందల్లా కేవలం వాళ్లు ఏర్పరచిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌లో మన పేరు, అడ్రసు, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీలను పొందుపరిస్తే చాలు. దరఖాస్తు చేసిన ఏడు నుంచి పదిరోజుల్లోపు కేవలం రూ.199ల డెలివరీ రుసుముతో జియోసిమ్‌లను ఇంటికి తెచ్చిస్తామని ఆ వెబ్‌సైట్లు ప్రకటిస్తున్నాయి. ఈ సిమ్ లతో పాటు రూ.1,999కే రిలయన్స్‌ జియో డోంగిల్‌, రూ.2,199కే రిలయన్స్‌ వైఫై డోంగిల్‌లను అందిస్తున్నామని సైట్లు ప్రచారిస్తున్నాయి.


కాని నిజానికి జియో కేవలం సిమ్ లు మాత్రమే ఇస్తుంది తప్ప , మిగతావేమి ప్రకటించలేదు. కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వాట్సప్‌, ఈమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరుపుతున్నాయి. సిమ్‌ డెలివరీ సమయంలో వారు సేకరిస్తున్న అడ్రస్‌, గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో వంటి పూర్తి వివరాలను సేకరిస్తున్న ఈ వెబ్‌సైట్లు మనకు ప్రమాదాల్ని తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌ వినియోగదారులు ఇది గమనించి అటువంటి మోసపూరితమైన వెబ్‌సైట్లను నమ్మి మీ పర్సనల్ వివరాలు వారికి అందజేయవద్దని మనవి చేస్తున్నారు.