News and Entertainment

గడ్డం ఉన్న మగాళ్లంటే ఆడవాళ్లకి ఎక్కువ ఇష్టమట.. కారణం తెలిస్తే షాకవుతారు


సాధారణంగా ఆడవాళ్ళు గడ్డం పెంచే మగవారిని బాగా ఇష్టపడతారని అంటుంటారు. అవును అదే నిజమేనట. తమ బాంధవ్యాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడానికి బాగా గడ్డం ఉన్న మగవాళ్లు అయితేనే సరిగ్గా సరిపోతారని కొందరు మహిళలు భావిస్తున్నారట. ఈ విషయం తాజాగా ఒక పరిశోధనలో తేలింది. గడ్డం ఉన్న మగవారు ఆడవాళ్లను బాగా ఆకర్షిస్తారట. అలాగే తమకు పిల్లలు కలగడానికి, తమకు కావాల్సినవన్నీ చేయగల దమ్ము కూడా అలాంటి మగవారిలోనే ఎక్కువగా ఉంటుందని ఆడవారు నమ్ముతారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

గడ్డానికి, మగతనానికి మధ్య పరస్పర సంబంధం ఉందని ఆస్ట్రేలియా లో క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో తెలిపింది. బాగా క్లీన్ షేవ్ చేసుకున్న ఫొటో, కాస్త గడ్డం పెంచిన ఫొటో, బాగా గడ్డం పెంచిన వ్యక్తి ఫొటోలను అప్ లోడ్ చేశారు. ఆ ఫొటోల్లో కాస్త నుదురు, దవడవంటి ప్రాంతాలలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీంతో ఒకే వ్యక్తి వేర్వేరుగా కనపడేటట్లు చేసి ఒక సర్వే చేపట్టారు.

అయితే వీటిలో ఓవరాల్ గా ఫుల్ షేవ్ చేసుకున్న వ్యక్తి ఫొటోకు కాస్త ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి. మగవారితో షార్ట్ టర్మ్ రిలేషన్ షిప్ కోరుకునే మహిళలంతా ఇలాంటి వారినే ఎంచుకుంటారని తేలింది. ఇక మరీ ఎక్కువగా మగతనం చూపించే మగాళ్ళు కాని లేదంటే కాస్త ఆడలక్షణాలు ఉన్నటువంటి మగవారిపట్ల ఆడవారు చాలా తక్కువగా ఆకర్షణ అవుతారని ఈ పరిశోధన తెలిపింది. ఇలా ఆడవాళ్ల ఇష్టాలకు అనుగుణంగా వారి నచ్చినట్టుగా తయరవ్వడానికి ఇష్టపడుతున్నారు.

గడ్డంతో ఉన్న ఫేసుకి రేటింగ్ చాలా భాగా వచ్చింది. తమ బాంధవ్యాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడానికి బాగా గడ్డం ఉన్న మగవాళ్లు అయితేనే సరిగ్గా సరిపోతారని కొందరు మహిళలు భావిస్తున్నారట. ఇక ఎందుకు లేటు మీరు కూడా గెడ్డం పెంచే పనిలో ఉండండి మరీ..