News and Entertainment

భార్య భర్తల మధ్య అన్యోన్యం పెరగాలంటే రాత్రి పడుకున్నప్పుడు భర్త ఈ చిన్న పని చేస్తే చాలు (సెక్స్ కాదండోయ్)


భార్యతో ప్రేమగా ఉండి కాపురంలో అన్యోన్యత మరింత పెరగాలంటే భాగస్వామిని పార్కులకో, సినిమాలకో తిప్పనక్కర్లేదు. వారికి కావాల్సినది కొనివ్వనక్కర్లదు. విహారయాత్రలు అస్సలే అక్కర్లేదు... అదేంటి ఇవేమీ చేయకుంటే భార్య ఊరుకుంటుందా..? రాచిరంపాన పెట్టదూ అనుకుంటున్నారా..? అలాంటి భయమేలేదు. ఎందుకంటే భార్యాభర్తల బంధంపై ఇటీవల ఓ సర్వే షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరగాలంటే కేవలం రాత్రి పడుకున్నప్పుడు భార్యపై చేయివేసి పడుకుంటే చాలట.


దాన్నే వారు హ్యాపీగా ఫీలవుతారట. రోజంతా పడిన కష్టాన్ని భర్త తనపై చేయివేసి నిద్రపోవడం ద్వారా మర్చిపోతారట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనని సర్వేలో తేలింది. ఇలా చేయి వేసుకుని పడుకున్న దంపతుల మధ్య కలహాలు లేవనీ, వారి కాపురం సజావుగా సాగుతోందని సర్వేలో తేలింది. అలా కాని దంపతుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక కలహం చెలరేగుతోందని తేలింది. దీంతోపాటు భర్తపై చీటికీమాటికి పోట్లాడరనీ, అదికావాలి.. ఇది కావాలి అంటూ పోరుపెట్టరనీ కూడా తేలింది. తనకేం కావాలో భర్తకు తెలుసంటూ భార్య భరోసాగా ఫీలవుతుందట.