News and Entertainment

బస్సులోనే ఆ....పని కానిచ్చిన లవర్స్


బస్సులో ఓ జంట చేసిన పనికి మిగతా ప్రయాణికులు సిగ్గుతో చచ్చిపోయారు. వారి చేష్టలు మితిమీరడంతో చివరికి డ్రైవర్కు చెప్పి బస్సు ఆపివేయించారు. దీంతో ఆ జంట ఎంచ్చక్కా బస్సు దిగి వెళ్లిపోయింది. ఇంగ్లండ్లోని కార్న్వాల్ నుంచి ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. అందులో 20 ఏళ్లు నిండిన ఓ జంట కూడా ఎక్కింది. అంతవరకు బాగానే ఉన్నా సాయంత్రం ఆరు దాటి కాస్త చీకట్లు కమ్ముకున్నాక ఆ జంట ఏమాత్రం సిగ్గు లేకుండా బస్సులోనే శృంగార కార్యకాలాపాలకు తెరతీశారు.

తోటి ప్రయాణికులు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా బస్సులోనే నిస్సిగ్గుగా ప్రవర్తించారు. బస్సులో వయసు మళ్లినవారు, చిన్నారులు కూడా ఉన్నారు. ఎవరినీ పట్టించుకోకుండా రెచ్చిపోతున్న జంటను చూసిన కొందరు చివరికి డ్రైవర్కు ఫిర్యాదు చేశారు. దీంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అయితే బస్సు ఆపిన మరుక్షణమే బస్సులోంచి కిందికి దిగిన జంట ఏమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు బస్సులో అలా ప్రవర్తించడం చూసి షాక్కు గురయ్యామని కొందరు చెప్పారు. వారు బస్సు దిగి వెళ్తున్నప్పుడు తాగిన మత్తులో ఉన్నట్టు కనబడ్డారని మరికొందరు తెలిపారు. ఈ ఘటనపై బస్సు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంటకోసం గాలిస్తున్నారు.
source:andhrajyothy