News and Entertainment

అతడికి 21, ఆమెకి 45... కొడుకులాంటి వాడివి అని చెప్పినా వదలకుండా..



అతడికి 21 ఏళ్ల వయస్సు. ఫిలిప్పీన్‌కు చెందిన అతడు బతుకు దెరువు కోసం దుబాయ్ వచ్చాడు. ఆమెకు 45 ఏళ్లు. ఆమె కూడా పొట్టపోసుకునేందుకు దుబాయ్ వచ్చింది. స్థానికంగా ఉండే ఓ జిమ్ సెంటర్లో క్లీనింగ్ చేసే పనిలో ఆమె చేరగా... జిమ్ సెంటర్ సౌకర్యాలను పర్యవేక్షిస్తూ చిన్నచిన్న పనులు చేయడానికి అతడు కుదిరాడు.

తన కుమారుడి వయసు ఉంటుంది కదా అని అతడి పనులు కూడా అప్పుడప్పుడూ ఆమె చేసేది. అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా చూసుకునేది. అయితే ఆమెను తప్పగా అర్థం చేసుకున్న అతడు...
పెద్ద ఘోరానికి పాల్పడ్డాడు. ఓ రోజు జిమ్ సెంటర్లో ఎవరూ లేని సమయంలో గది తుడుస్తున్న ఆమెను పట్టుకుని అత్యాచారం చేయబోయాడు. దీంతో సడన్ షాక్‌కు గురయిన ఆమె తేరుకుని.. తనకు పెళ్లయిందనీ, పిల్లలు ఉన్నారనీ, ఓ కొడుకులా భావించానని వేడుకున్నా వినలేదతడు.

చేతులు విరిచి అరిస్తే చంపేస్తానని బెదిరించి నగ్నంగా ఉంచి ఫోటోలు తీశాడు. తనతో శృంగారానికి ఒప్పుకోకుంటే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడా యువకుడు.