News and Entertainment

బాబోయ్‌… 41 కోట్ల మంది సెక్స్ సీక్రెట్స్ ఒకేసారి బయ‌ట‌ప‌డ్డాయి…!


ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. వంద‌లు కాదు.. చివ‌రికి వేలు ల‌క్ష‌లు కూడా కాదు.. కోట్లు.. అందులోనూ 41 కోట్ల మంది శృంగార ర‌హ‌స్యాలు ఒకేసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ లోపాల‌ని బ‌య‌ట‌పెట్టే లీక్డ్ ఫోర్స్ వెబ్‌సైట్ ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టింది.

ఇంట‌ర్‌నెట్ యూజర్లు ఆన్‌లైన్‌లో త‌మ పార్ట్‌న‌ర్స్‌ని వెతుక్కునే అడ‌ల్ట్ ఫ్రెండ్‌పైండ‌ర్స్‌.కామ్ లాంటి అనేక వెబ్‌సైట్స్‌లో రిజిస్ట‌ర్ అయిన 41 కోట్ల మంది డీట‌యిల్స్ లీక్ అయ్యాయి. లీక్ అయిన డేటాలో యూజ‌ర్‌ల సెక్సువ‌ల్ అభిరుచులు, వారి శృంగార అల‌వాట్లు, వివాహేత‌ర సంబంధాల‌ని ఇష్ట‌ప‌డ‌తారా? లేదా..? వ‌ంటి వివ‌రాల‌న్నీ ఈ లీక్ అయిన డేటాబేస్‌లో ఉన్నాయి. దీంతో, ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి సైట్స్‌లో త‌మ పేర్లను రిజిస్ట‌ర్ చేసుకున్న వారంతా వ‌ణికిపోతున్నారు. ఎక్క‌డ వారి వివ‌రాలు ప‌డ‌కూడ‌రాని చేతిలో ప‌డి త‌మ‌ను బ్లాక్‌మెయిల్ చేస్తారేమోన‌ని ద‌డుసుకుంటున్నారు. మ‌రోషాకింగ్ విషయం ఏంటంటే.. యాక్టివ్‌గా ఉన్న యూజ‌ర్ల వివ‌రాలే కాదు.. ఎప్పుడో ఏళ్ల క్రితం డిలీట్ అయిన వారి వివ‌రాలు కూడా ఉన్నాయ‌ట‌.ముఖ్యంగా లీక్ అయిన వెబ్‌సైట్స్‌లో ఎక్కువ‌గా అడ‌ల్ట్ ఫ్రెండ్ ఫైండ‌ర్‌. కామ్‌, కామ్స్‌.కామ్‌, పెన్‌థౌస్‌.కామ్‌, స్ట్రిప్స్‌.కామ్‌, ఐకామ్స్‌.కామ్‌లాంటి అనేక అడ‌ల్ట్ కంటెంట్ వెబ్‌సైట్‌ల స‌మ‌చారం ఈ డేటాబేస్‌లో ఉంది.

లీక్ అయిన ఎకౌంట్స్ సంఖ్య దాదాపుగా ఇలా ఉంది :
అడ‌ల్ట్ ఫ్రెండ్ ఫైండ‌ర్.కామ్‌ – 33.98 కోట్లు
కామ్స్.కామ్‌ – 6.27 కోట్లు
పెన్‌థౌస్‌.కామ్‌ –71.8 లక్షలు
స్ట్రిప్స్‌.కామ్‌ – 14.2 లక్షలు
ఐకామ్స్‌.కామ్‌ – 11.3 కోట్లు
ఇత‌ర వెబ్ సైట్స్‌ – 35 వేలు

అయితే, ఈ సెక్స్ డీట‌యిల్స్‌ని లీక్ చేసిన‌వారు హ్యాకర్‌లు కాదు. లీక్డ్ ఫోర్స్ వివ‌ర‌ణ ప్ర‌కారం.. కేవ‌లం ఇంట‌ర్‌నెట్‌లో సెక్యూరిటీ ప‌రంగా ఉన్న స‌మ‌స్య‌ల్ని యూజర్‌ల‌ని చైత‌న్య‌వంతం చేసేందుకే ఇలా చేశామ‌ని చెబుతున్నారు. ఈర‌కంగా యూజ‌ర్‌ల‌కి శుభ‌వార్తే అన్న‌మాట‌.

ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ కంటే ముందు పాపుల‌ర్ బాగా పాపుల‌ర్ అయిన సోష‌ల్ మీడియా మెస్సెంజ‌ర్ మైస్పేస్‌. మూడేళ్ల క్రితం మై స్పేస్‌కి సంబంధించి 36కోట్ల అకౌంట్‌లు లీక్ అయ్యాయి. దాని త‌ర్వాత ఇదే అది పెద్ద‌ది. ఇప్పుడు ఈ వార్త ఎంతోమంది అడ‌ల్ట్‌ యూజ‌ర్‌లకు షాక్ ఇస్తోంది.