News and Entertainment

మిస్డ్ కాల్ ఇస్తే.. 2 జీబీ 4జీ డేటా ఫ్రీ… ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!


ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్ ఆఫర్ ప్ర‌క‌టించింది. జియో నెట్‌వ‌ర్క్‌, డేటాపై విమర్శ‌లు పెరుగుతున్నాయి. నెట్ వ‌ర్క్ స‌రిగా క‌ల‌వ‌డం లేద‌ని, డేటా కూడా మునుప‌టిలా ఫాస్ట్‌గా లేద‌నే కామెంట్స్ వినియోగ‌దారుల నుంచే వ‌స్తున్నాయి. దీంతో, ఎయిర్ టెల్ త‌న హ‌వాని చాటుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌తో మార్కెట్‌లో ప్ర‌కంప‌న‌ల‌కు రెడీ అయింది. ఒక్క మిస్డ్ కాల్‌తో ఏకంగా 2 జీబీ ఫ్రీ డేటా ఆఫ‌ర్‌ని ప్ర‌క‌టించింది.

అయితే, దీనికి ముందుగా త‌మ పాత సిమ్‌ని 4జీకి అప్‌డేట్ చేయించుకోవాలి. ఇలా చేయించుకోవ‌డానికి ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీకు 2జీబీ డేటా వ‌స్తుంది. మీరు మీ 2జీ లేదా 3జీ సిమ్‌ని 4జీకి అప్‌గ్రేడ్ చేయించుకునే క్ర‌మంలో ముందుగా http:www.airtel.in/4g/sim-swapకి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ త‌ర్వాత వ‌చ్చిన మెస్సేజ్‌కి మీ పేరు, అడ్ర‌స్‌, ఈ-మెయిల్ ఐడీతోపాటు ఇత‌ర డీట‌యిల్స్ కూడా టైప్ చేసి send me a 4g sim అని టైప్ చెయ్యండి. మీరు ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం మీ అడ్ర‌స్‌కి సిమ్ వ‌చ్చేస్తుంది. అది అప్‌గ్రేడ్ అవ‌డానికి కొద్ది రోజుల స‌మ‌యం ప‌డుతుంది.


యాక్టివేష‌న్ పూర్తి అయిన వెంట‌నే మీ కొత్త 4జీ సిమ్ నుంచి 52122కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చిన 48 గంట‌ల్లోపే మీకు 2జీబీ 4జీ డేటా మీకు ఫ్రీగా ల‌భిస్తుంది. కేవ‌లం ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ యూజ‌ర్‌ల‌కు మాత్రమే దీనిని ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్ కింద ఇస్తున్నారు. అయితే, మీరు త‌ప్ప‌నిసరిగా 4జీ నెట్ వ‌ర్క్‌లో ఉండాలి సుమా. అప్పుడే ఈ ఆఫ‌ర్ మీకు వ‌ర్తిస్తుంది. లేదంటే అంతే సంగ‌తులు.