News and Entertainment

జియోకి పోటిగా ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌..!



జియో రాకతో టెలికం ఆపరేటర్ల మధ్య నువ్వా-నేనా అన్న చందాన టారిఫ్ వార్ నడుస్తోంది. రిలయన్స్ జియో అన్‌లిమిటెడ్ వాయిస్ ఇంకా డేటా ప్లాన్స్ మార్కెట్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికం ఆపరేటర్స్ పోటాపోటీగా తగ్గింపు ఆఫర్లను రెగ్యులర్‌గా లాంచ్ చేస్తున్నాయి.ఇక వినియోగ దారులు కూడా బాగానే పెరగడంతో, దానికి పోటీగా ఎయిర్ టెల్ సంస్థ భారీ ఆఫర్స్ తో యూజర్స్ ను ఆకట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగానే  ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 28 రోజుల వ్యవధిలో 18జీబి వరకు 3జీ/4జీ మొబైల్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చట. 2,249 పెట్టి రీఛార్జ్ చేయించటం ద్వారా ఈ ఆఫర్‌ను ఎయిర్‌ టెల్ యూజర్లు పొందవచ్చు.


 ఇక ఈ ఆఫర్ ను పొందడానికి  మీ ఎయిర్‌ టెల్ నెంబర్ నుంచి #121*1#కు డయల్ చేయండి. ఆఫర్ మీ నెంబర్‌కు అందుబాటులో ఉందో లేదో తెలిసిపోతుంది.లేక మై ఎయిర్ టెల్ యాప్‌ ను మీ ఫోన్‌ లోకి డౌన్‌ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ద్వారా మీ ఎయిర్‌ టెల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత స్పెషల్ ఆఫర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత అక్కడ కనిపించే స్పెషల్ ఆఫర్స్ లో భాగంగా 2,249 రీఛార్జ్ ఆఫర్ పై క్లిక్ చేయండి. పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కార్డ్ వివరాలను ఎంటర్ చేసిన పే ఆప్షన్ పై క్లిక్ చేయండి.ఒక వేళా ఆ ఆఫర్ మీరు అర్హులైతే, మీ నంబర్ కు ఈ ఆఫర్ యాక్టివేట్ అవ్వడానికి దాదాపు 4 గంటల వరకు పట్టొచ్చు.ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఎయిర్‌ టెల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం 3జీ/4జీ నెట్‌వర్క్‌లకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.