News and Entertainment

ఇంట్లో అల్లుమినియం పాత్రల్లో వండుతున్నారా.. మీ కుటుంబం ప్రమాదంలో పడ్డట్టే.. ఎందుకంటే


ఎంచుకునే ఆహారం మన ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ, మీకు తెలుసా! ఆహార తయారు చేయటానికి ఎంచుకునే పాత్రలు కూడా చాలా ముఖ్యం. నూతన అధ్యయనాల ప్రకారం, అల్యూమినియం పాత్రలను వంటలలో వాడటం వలన మన శరీరంలో హానికర కారకాలు చేరుతున్నాయని మరియు తయారు చేసే ఆహారంలో అల్యూమినియం మూలకం కలిసి, 1 నుండి 2 గ్రాముల వరకి మన శరీరంలో ఈ మూలకం శరీరంలో చేరి, హానికర వ్యాధులకు గురి చేస్తుందని తెలిపారు. ఇప్పటికీ మన జైళ్లలో రాతిండి పాత్రల్లోనే వండి రాతిండి కంచాల్లో ఖైదీలకు భోజనం పెడతారు. క్రమేణా జైళ్ల నుంచి ఇళ్లకు చేరిన రాతిండి గిన్నెల్లో తింటే దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్యాలు సోకే ప్రమాదం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. రాతిండిలో వంట చేసుకుని తింటే ఏమేమి సమస్యలు వస్తాయంటే..

* ప్రపంచవ్యాప్తంగా, అల్యూమినియం పాత్రలను ఆహార తయారీలో వాడుతున్నారు.
* అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని వేడి చేయటం వలన లోహం కలుస్తుంది.
* శరీరంలో అల్యూమినియం చేరటం వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
* ఐయోనైజేషన్ చేసిన అల్యూమినియం లేదా వేరే రకం పాత్రలలో వంట చేసుకోండి.
* రాతిండి గిన్నెల్లో వంట చేసినా, వండిన పదార్థాలు నిలువ చేసినా క్రమంగా విషతుల్యం (స్లో పాయిజన్) అవుతాయి. షుగర్, బి.పి, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, రకరకాల క్యాన్సర్లకు దారితీస్తాయి.
* అల్యూమినియం (రాతిండి) పాత్రల వాడకం పెరిగిన తర్వాతనే మనకు కీళ్ల నొప్పులు, షుగర్, లివర్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు పెరిగాయని ఇటీవల వైద్య నిపుణులు చెబుతున్నారు.

* చాలా పరిశోధనలు సైతం రాతిండి గిన్నెలను వంటలకు వాడడాన్ని తగ్గించాలని చెబుతున్నాయి. అందుకే అల్యూమినియం (సత్తు, సిల్వర్) పాత్రల్లో వంట చేయడం మానండి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి. ఈ కొత్త విషయం పది మందికీ తెలిసేలా షేర్ చేయండి..