News and Entertainment

పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన కామన్ మాన్ ..సోషల్ మీడియాలో వీడియో హాల్ చల్మా రాయలసీమ ప్రజలు అవసరమైతే ఆత్మభిమానంకోసం ప్రాణత్యాగమైన చేస్తాం గాని ఆత్మభిమానాన్ని అమ్ముకోలేము..అన్ని వీడియో లో చెప్పలేక పోయా నా ప్రయత్నం చేశా మిగిలింది ఇలా కలం తో రాసా..

ఒక అనంతపురం జిల్లా వాసిగా నిన్న జరిగిన , పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సమైక్యఆంధ్రుల హక్కులకోసం సభ గురించి మాట్లాడాలి అనుకున్నా .

కళ్యాణ్ గారు నిన్న మా అనంతపురం జిల్లా వాసులైన గొప్ప వాళ్ళగురించి , కరువు , నిర్యుద్యోగ , ఆడవాళ్ళ పడుతున్న ఇబ్బందులు పై స్పందించడం, జరిగిన అన్యాయం మీద పోరాడతాను అని చెప్పడం చాల ఆనందదాయకం మరియు ఆహ్వానించతగ్గ విషయం. కానీ కళ్యాణ్ గారు ఇన్నేళ్లు రాజకీయనాయకులు ఏమి చేసారు అసలు వాస్తవాలు ఏమి తెలియకుండా మాట్లాడిన తీరు మాకు సంతృపికలిగించలేదు . నాకు ఉన్న పరిజ్ఞానం వరకు నేకు తెలిసిన వాస్తవం చెప్తా ..
ఒకరు నీలం సంజీవ రెడ్డి మా జిల్లా నుంచి రాష్ట్రపతి మరియు మన ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి గా పని చేసి మా జిల్లా ఈ రోజు ఈరోజు కాస్తో కూస్తో బతికి బట్టఁగడుతుంది ...
ఇంకొకరు స్వర్గీయ రామారావుగారు తనను ఎమ్మెల్యే గా గెలిపించినందుకు ఎదో ఒకటి చేయాలి అని అప్పట్లోనే హిందూపురం కి పరిశ్రమల స్థాపన కోసం కృషిచేశాడు ఇపుడు వందలమందికి ఉపాధికల్పించాడు అంతేకాకుండా తాగునీరు కోసం అని హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వాలి అని తపన పడ్డాడు ..

ఇంకొకరు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 2004 ముందు అనంతపురం లో నక్షలిజం పాతుకుపోయిండేది , రైతులు మరియు వ్యవసాయం అప్పుల ఉబిలోయూడేది ..
అందరికి రుణవిముక్తి చేసి ఉచిన కరెంటు ఇచ్చి వ్యవసాయరంగానికి ఉపిరిపోసేకార్యక్రమం చేసారు అందులో భాగంగా పేపర్లకే పరిమితం అయినా పోలవరం, హంద్రీనీవా , గాలేరు నగరి , తెలుగు గంగ కి శ్రీకారం చుట్టాడు హంద్రీనీవా ద్వారా సీమ జిల్లాలకు సాగునీరు అందించారు ఈరోజు మా ఊరు మంచి పంటలు పండిస్తున్నారు .అంటే హంద్రీనీవా ఒక కారణం లేదంటే మళ్ళి సంవత్సరంకి మా ఊరు ఏమి ఉండేది కాదు .ప్రస్తుతానికి నాకు తెలిసి కర్నూల్ జిల్లా లో కొన్ని ప్రాంతాలతో పాటి మా జిల్లా లో ఉరవకొండ , గుంతకల్ ,శింగనమల, అనంతపురం, రాప్తాడు,పెనుగొండ, ధర్మవరం నియోజకవరం లో సాగునీరు వస్తున్నాయి .

ఇంకా రాయలసీమ మొత్తం సాగునీరు అదే నువ్వు 100 టీఎంసీ నీళ్లు మాకు కావాలి అని, అది సాధ్యంకావాలి అంటే ఒకటి తుంగభద్ర నుంచి 32 టీఎంసీ నీరు మనకు రావాలి , జీవో 69 అములు చేయాలి . పోలవరం,హంద్రీనీవా , గాలేరు నగిరి పూర్తిఅవ్వాలి . వీటికి ప్రాణం పోసింది వైస్సార్ , ఉపాధి మరియు కరువు ప్రాంత అభివ్రుది కోసం లేపాక్షి హబ్బు పెట్టాడు ఇలా ఒకటి కాదు చాలాఉన్నాయి ఇలాంటివి వాళ్ళని పంచలూడగొడతాం అనడటం ఏంటి ? అయన హత్థమరణించి 7 ఏండ్లు కావొస్తున్నా ఇవి అన్ని ఇపుడు అర్ధ్వాంతరంగా నిలిచ్చిపోయే ఇవ్వి మీకు కనిపించావు మంచి ఎవరు చేసిన మంచే , నాణ్యానికి ఒకవైపు కాదు రెండోవైపు కూడా చూడాలి .

ఇంకోపోతే అనంతపురం జిల్లా లో మహిళలు బతుకు దెరువు కోసం వాళ్ళ శరీరాలు అమ్ముకుంటున్నారు అంటున్నవ్ అది ఎంత మాత్రం నిజమో . పొట్టకూటి కోసం శరీరాలు అమ్ముకునే వాళ్ళు కాదు, మా రాయలసీమ ప్రజలు అవసరమైతే ఆత్మభిమానంకోసం ప్రాణత్యాగమైన చేస్తాం గాని ఆత్మభిమానాన్ని అమ్ముకోలేము..కొంచం వాస్తవాలు తెలుసుకోండి , మరి రాష్టంలో కాల్ మనీ పేరు తో ఎంత మంది మహిళలు ని వ్యభిచార కుంపటిలోకి దించారు దానికి తగ్గ సాక్షాధారాలు ఉన్న మరి వారి కోసం ఎందుకు పోరాడటం లేదు అసలు ఎందుకు స్పందించలేదు ... ఇలా ఒకటేమిటి చాల ఉన్నాయ్ మొత్తానికి ఏమి చెప్పదలుచుకున్ను అంటే రాజకీయాలు , సమాజసేవ చేయాలి అంటే ఆవేశం కాదు ఆలోచన ఉండాలి ,ముందుచూపు , దీర్ఘకాలిక ప్రణాళికలు , మాట మీద నిలబడి కష్టం అనిన నష్టం అయినా నిలబడాలి పోరాడాలి, న్సిహ్పక్షపాతంగా ఉండాలి అంతేకాని రెండునాళ్ళ ముచ్చటకాదు.
ఎందుకు అంటున్నంటే రాజకీయాల్లో మీరు 2009 లో మా అన్నకి వోట్ వేయండి అన్నావ్ నొమ్మి వోటువేసిన వాళ్లందరికీ మీరు ఎం సమంధనం చెప్పారు తీసుకెళ్లి సంతలో గొఱ్ఱెలమంద అమ్మేసినట్లు అమ్మేసారు అపుడు ఒక్కసారి ఐయినా మీరు ప్రజలకు క్షమాపణ కోరారా? మీ అన్న అయితే ఒకలా , ఒకొకరు అయితే ఇంకొకలా ఐతే ఎలా .

సర్లే అపుడు అంటే ఆవేశం రాజకీయాలు అనుకుంటే .
2014 మాత్రం 2009 లో విమర్శించినా వాళ్ళకే వోట్ వేయండి అన్నావ్ మరి ఇపుడు ఏమైంది అంది ..ప్రశ్నియిస్తా అంన్నావ్ ఇపుడు ఏమో ఇంకా టైం ఉంది లే అన్నట్లు అపుడపుడు వస్తావు వచ్చిన కూడా దానిమీద సరిగా అవగాహన లేదు అంటావ్ , కేంద్రం ఇచ్చిన రెండు పేజీల లేఖ నే అర్థం చేసుకొని నేను ఎదో సాదాసీదా విద్యార్థిని అర్థం అవ్వలేదు ఇపుడు అర్థం ఐంది అన్నావ్ రెండు పేజీలు ఉన్న లెటర్ నే ఇన్ని రోజులకు అర్థం చేసుకుంటే మరి ఇంత పెద్ద ప్రజస్వాయం ని ఎపుడు అర్ధం చేసుకుంటావ్ మళ్ళి 2019 నేకు ఏమి చూసి వోట్ వేయాలి ..

సర్లే సమాజసేవ అంటే అపుడు ఎదో ఆవేశం లో కోటి ఇచ్చి అది చేస్తాం అన్నావ్, ఎవరైనా వెళ్లి సహాయం చేయండి అంటే ఎంత ఉంది అని చూడకుండా మొత్తం ఇచ్చే గుణం మేలో ఉంది కానీ ఆలా ఐతే మీరు చేస్తుంది తాత్కాలికం , ఎందుకు ఒక సంస్థ పెట్టి దాన్ని కూడా ఒక పద్దతి గా నడపలేకపోతున్నారు , ఏమి లేని వల్లే దేశం లో ఎన్నో స్వచంద్రసమస్థలు నడుపుతున్న ఈకాలం లో మీరు ఎందుకు మీరు సంస్థని ప్రజల్లోకి తీసుకుల్ల్లెళ్లలేక పోయారు ..

పోరాడతా పోరాడతా అని అరుస్తునవ్ అంటావ్ గా ఇప్పటి వరకు ఏ ఒక్క కారణమా మీద ఐయినా పోరాడతారా ? అయినా సమస్యల పోరాడటానికి కావాల్సింది పార్టీనో , డబ్బులుకాదు గుండెల్లో దమ్ము మరియు ప్రజల సమస్యల పట్ల శ్రాధ . ఎపుడో నేకు నచ్చి నపుడు కుదిరినపుడు కాదు సమస్యల మీద పోరాడేది .

ఇలా రాజకేయం , సమాజసేవ , పోరాటాలు ఇంతవరకు వీటిలో మీరు ప్రజలు ని సంతృప్తి పరిచారు ఏమి అనుభువం ఉంది అని 2019 లో పోటీ చేస్తా అంటున్నారు. అనుభవం ఉంది అని వోట్ వేయమని అడిగావు ఇపుడు ఎం ఐంది .

నాయకుడు అనేవాడు నాతో డబ్బులేదు , నేను అధికారం కోసం కాదు , మీపట్ల పోరాడుతా మీరు నాతో పాటు నడవండి అని చెప్పడం కాదు , మీరు ముందుకు నడుస్తుంటే మీరు చేసే పోరాటం లేదా విధివిధానాలు చూసి వల్లే నీవెంట వస్తారు .

నీకన్నా వయసులో చిన్నవాడిని అయినా పెద్దమనసుతో అర్థం చేసుకుంటారు అని , ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి .
ప్రతాప్ రెడ్డి ముకుందాపురం

పేస్ బుక్ నుండి తీసుకోబడినది.
video