News and Entertainment

ఆంజనేయ స్వామి మళ్ళీ పుట్టాడా...ఈ అద్భుతం మీరే చూడండి..!



ఒక మనిషి అసాదారణంగా పుడితే అతనికెన్ని ఇబ్బందులో, అన్ని లాభాలు  కూడా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక వ్యక్తి తోకతో జన్మించాడు. అతనికిప్పుడు 35 ఏళ్ళు. ఇంచుమించు 14 అంగుళాల తోకతో అతను ఇబ్బందులు పడుతుంటే, వందలమంది అతను ఆంజనేయుడి ప్రతిరూపమని అతన్ని పూజిస్తున్నారు. ఆంజనేయుడిలాగే అతని కూడా తోక ఉండడం దాని పై జుట్టు కూడా ఉండడంతో చాలా మంది అతనికి భక్తులుగా మారిపోయారు.

అతని భార్య మారినో ఆమె తల్లిదండ్రులు చనిపోయాక సోదరుడి బలవంతం మీద అతన్ని  పెళ్లి చేసుకుంది. వైద్యులు ఇది జన్యుపరమైన లోపం అని చెబుతున్నారు. అయితే భక్తులు వందల మైళ్ళ నుంచి అతని ఆశీస్సుల కోసం వస్తున్నారు. అతని ఆశీస్సులు ఉంటే జబ్బులు తగ్గుతాయని వారి నమ్మకం. కొద్ది రోజుల్లో అతని భక్తులు అతనికి ఒక గుడి కట్టీ ఆలోచనలో ఉన్నారు.