News and Entertainment

కూతురితో పెళ్లి... అత్తతో కాపురం... అసలు విషయం తెలిస్తే షాకే..



అల్లుడిని పిచ్చిగా ప్రేమించి కూతురి కాపురంలో చిచ్చు పెట్టిన అత్త.. కూతురుని చూడాలనే సాకుతో వచ్చి అల్లుడితో రాసలీలలు ఓ తల్లి కూతురు కాపురంలో చిచ్చు పెట్టింది. అల్లుడితో రాసలీలలు నడిపింది. చివరికి ఇది పెద్దల పంచాయితి కి వెళితే.. వాళ్ళు ఇచ్చిన విచిత్ర తీర్పు తో అందరూ షాక్ తిన్నారు. బీహార్‌ లో జరిగిన ఈ ఘటన వివరాలలోకి వెళితే..

లలిత తన భర్త సూరజ్‌ తో హాయిగా కాపురం చేసుకుంటుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. లలిత తల్లి ఆశాదేవి. ఆశాదేవి కూతురు భర్త సూరజ్‌ ను ప్రేమించింది. వారి ప్రేమ వ్యవహారం కాస్తా శ్రుతిమించి అక్రమ సంబంధానికి దారి తీసింది.

కూతురుని చూడాలనే సాకుతో వచ్చిన ఆశాదేవి అల్లుడితో రాసలీలలు నడిపేది. అత్త మోజులో పడిన సూరజ్ లలితను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. వీరి సంబంధం గురించి లలిత కి తెలిసి కూడా ఏమి చేయలేని పరిస్థితి. తన తల్లితో అక్రమ సంబంధం తప్పని భార్య ఎంత వాదించినా సూరజ్ వినలేదు. దీనిపై భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. విచిత్రం ఏమిటంటే.. చివరకు అత్త అల్లుడు పెళ్లి కూడా చేసుకున్నారు. అంతకంటే మరో విచిత్రం ఏమిటంటే.. పంచాయితి పెద్దలు కుడా వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.



ఆశాదేవి గంటల తరబడి అల్లుడితో ఫోన్‌ లో మాట్లాడేదని.. ఆ సంభాషణల క్రమంలో అల్లుడిపై పిచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందని పంచాయితి పెద్దలు తేల్చారు. వాళ్లిద్దరూ పిచ్చిగా ప్రేమించుకున్నారని, అందువల్ల వారిని విడదీయడం సరికాదని పంచాయతీ పెద్దలు భావించడం విశేషం. ఇక చేసేదేమీ లేక.. లలితను ఆమె తండ్రి, ఆశాదేవి మాజీ భర్త పురాని లోని ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య తన అల్లుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూతుర్ని ఆ ఇంట్లో ఉంచడంలో అర్థంలేదని తండ్రి చెబుతున్నాడు.