News and Entertainment

లీకైన బాహుబలి 2 యుద్ధ సన్నివేశాలు.. నెట్లో వీడియో హాల్చల్..(వీడియో)


టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ…తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన సినిమా బాహుబలి….ఈ సినిమా సృష్టించిన రికార్డుల ప్రభంజనం అంతా ఇంతా…కాదు…అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని ముగిస్తూ…రెండో భాగం పై అంచనాలను భారీగా పెంచేసాడు దర్శకుడు రాజమౌళి….అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న గురించి యావత్ ప్రపంచం ఆలోచించుకుని…డిస్కస్ చేసుకుని….దాని గురించి డిబేట్ కూడా చేసుకునేలా చేశాడు మన రాజమౌళి…

అయితే అదే క్రమంలో ఈ సినిమా మొదలి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో…అన్న విషయం పక్కన పెడితే…రెండో భాగంపై చాలా ఆశలే పెట్టుకున్నారు మన ప్రేక్షక దేవుళ్ళు..ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో అనుకోకుండా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆన్‌లైన్ లో ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా అవ్వాక్కు అయ్యారు. దాదాపుగా రెండు వీడియోలు ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నాయి. షాట్ నంబర్6 నుంచి షాట్ నంబర్ 60 వరకూ యుద్దానికి సంభందించిన సీన్స్ లీక్ అయ్యినట్లు తెలుస్తుంది…అయితే ఆ వీడియోస్ ను చూసి ఒక పక్క నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తుంటే….మరో పక్క అంతటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇలా పైరసీ భారిన పడటం నిజంగా చాలా బాధాకరం…
The movie makers asked the movie lovers not to share the video link on any social media.  “We are making every effort to ensure that the leaked content is not in the public domain. We would be grateful if you can cooperate with us in this effort. We request you not to share the content and report any links on the internet or social media to info@arkamediaworks.com.”