News and Entertainment

చరణ్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!



సినిమా ఇండస్ట్రీలో కొందరితో అనుకున్న మరికొందరితో చేస్తూ ఉంటారు. వారికి కథ నచ్చకో, తమకు సూట్ అవుతుందో లేదోనని, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన ఇలా సినిమాను మిస్ చేసుకుంటూ ఉంటారు. అది హీరోలు కావచ్చు లేదా హీరోయిన్లైనా కావచ్చు. అటువంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వదులుకున్నారట. ఆ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది.   టాలీవుడ్ లో ఊర మాస్ సినిమాలను డైరెక్ట్ చేసే డైరెక్టర్ గా బోయపాటి శ్రీను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేసిన మాస్ ఎంటర్ టైనర్ ‘సరైనోడు’. అయితే మొదట ఈ కథను చరణ్ కు బోయపాటికి చెప్పగా, కథ నచ్చినా ఎక్కడో ఏదో లోటుగా అనిపించిందట. కట్ చేస్తే అక్కడి నుండి బన్నీ గూటికి కథ చేరడం అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసి, అల్లు అరవింద్ నిర్మాతగా, బన్నీ, రకుల్ జంటగా యంగ్ హీరో ఆది విలన్ గా ‘సరైనోడు’ సినిమా తెరకెక్కి, అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది.


అలాగే క్రిష్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా వచ్చిన “కంచె” సినిమా కూడా ముందు చరణ్ దగ్గరకే వెళ్లిందట కానీ ఎందుకో చరణ్ నో చెప్పాడు. పైగా ఆ సినిమాని వరుణ్ తో చేయమని చరణ్ సూచించారట. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న “ఫిదా” సినిమా కూడా ముందు చరణ్ దగ్గరకి వచ్చిందంట. కానీ కొన్ని కారణాల వలన చరణ్ ఆ సినిమాని వదులుకున్నాడు. పాపం చరణ్ కదూ…!