News and Entertainment

స్మార్ట్‌ఫోన్ పేలుడుకు కారణం ఏంటో తెలిసింది... ఇది చదివి మీరు కూడా జాగ్రత్తపడండి



స్మార్ట్‌ఫోన్లు కొంటున్న ప్రతీఒక్కరికీ ఫైర్‌ఫ్రూఫ్ టూల్స్‌ను అందించనున్నాయట కొన్ని కంపెనీలు.. ఎందుకంటే చార్జింగ్ పెట్టేసమయంలో కరెంట్ షాక్ కొట్టకుండా ముందు జాగ్రత్తగా ఈ విధాన్నాన్ని అమలు చేయబోతున్నారట. పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడం సాధారణమైన విషయంగా మారింది.
ఈ పరిస్థితులన్నింటికీ గల కారణాలను వివరించారు గూగుల్‌కు చెందిన ఇంజనీర్ ‘బెన్‌సన్ లీయుంగ్ సెల్‌ఫోన్లు పేలడానికి గల కారణాన్ని వివరించాడు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చార్జర్లలను రెండు రకాలు ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారట.

ఒకటి త్వరగా చార్జింగ్ ఎక్కడానికి కాగా, మరోకటి అదే కేబుల్‌ను యుఎస్‌బీ-కనెక్టర్ కేబులుగా ఉపయోగిస్తున్నారు. ఒకే టూల్ ఇలా రెండు విధాలుగా ఉపయోగించడం అసాధ్యమని, అందుకే సెల్‌ఫోన్లు పేలుతున్నాయని ఆయన వివరించారు.

ఇక నుంచైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మేల్కొనొ జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.