News and Entertainment

అందంగా ఉండటమే ఈమె చేసిన తప్పా..? స్నానం చేస్తుండగా వీడియో తీసి..




ఈమె పేరు ఉష కడప. ఉండేది కడప జిల్లాలోని బద్వేలు. అందరి ఆడ పిల్లల్లాగే ఈమె కూడా ఇంటర్ వరకు సొంత ఊరిలో చదువుకుంది. ఆపై ఇంజనీరింగ్ విద్య కోసం నంద్యాలలోని RGM కాలేజీలో చేరింది. అయితే అంత బాగానే ఉంది కాని అందంగా పుట్టటమే శాపం అయ్యింది.. చక్కగా కనిపించటమే పాపం అయ్యింది.. కాలేజీకి వెళితే అందరి కళ్లు ఈ అమ్మాయిపైనే.. సీనియర్ కంట్లో పడితే చాలు ర్యాంగింగ్.. గంటలకొద్దీ మాటలు కలిపేవారు.. నిత్యం వేధింపులు.. అందంగా ఉండటంతో సీనియర్స్ అందరూ ఉష వెంటపడేవారు. ర్యాంగింగ్ పేరుతో గంటలకొద్దీ మాట్లాడేవారు. వీటిని భరించలేకపోయింది ఆ అమ్మాయి. అందరి కళ్లూ నాపైనే ఉంటున్నాయి.. దీనితో పాటు తను స్నానం చేస్తుండగా తోటి విధ్యార్దునిలే సెల్ ఫోన్లో చిత్రీకరించి కాలేజీ లెక్చరర్ కు పంపించారు. ఆ వీడియోస్ తో ఆ లెక్చరర్ బ్లాకు మెయిల్ చేయసాగాడు. ఒక పక్కా సీనియర్స్ వేధింపులు, లెక్చరర్ బ్లాక్ మెయిలింగ్ తట్టుకోలేకపోయింది. కాలేజీలో కూడా సైలెంట్ గా ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొన్నాళ్లు ఇంట్లో ఉంటే అన్నీ సర్దుకుంటాయంటూ ఇంటికి తీసుకొచ్చారు పేరంట్స్. 15 రోజులు ఇంట్లోనే ఉన్న ఉషను..



నాలుగు రోజుల క్రితం మళ్లీ కాలేజీలో వదిలిపెట్టారు పేరంట్స్. మళ్లీ కాలేజీకి వెళ్లిన ఉషకు వేధింపులు తగ్గకపోవటం.. ముభావంగా ఉండటంతో కాలేజీ యాజమాన్యం ఉష పేరంట్స్ కు సమాచారం ఇచ్చారు. కాలేజీకి వెళ్లిన కుటుంబసభ్యులు ఉషను తీసుకుని ఇంటికి బయలుదేరారు. అప్పటికే విషం తీసుకున్న ఈ అమ్మాయి.. బద్వేలు వచ్చే మార్గంలో సృహకోల్పోయింది. వెంటనే కడపలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి చనిపోయింది. నా అందమే నాకు శాపం అయ్యింది అంటూ ఉష చెప్పిన చివరి మాటలు అందర్నీ కలిచివేశాయి. కాలేజీల్లో ర్యాగింగ్ లేకుండా చేసేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రక్షణ లేకుండా పోతుంది.
Readరేప్ కు రేప్ శిక్ష అనే పంచాయితీ తీర్పు
Readనిద్రలో నడిచే అలవాటులా.. నిద్రలో సెక్స్ చేసే అలవాటు