News and Entertainment

వాట్స్ఆప్ లో ఆ లింక్స్ ఓపెన్ చెయ్యకండి...పొరపాటున ఓపెన్ చేస్తే



ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సప్ తప్పక ఉంటుంది. అయితే.. వాట్సప్ తాజాగా విడుదల చేసిన వీడియో కాలింగ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే ముందు కాస్త జాగ్ర‌త్త వ‌హించండి. ఇప్ప‌టివ‌ర‌కు బీటా వర్షన్‌ యూజర్లు మాత్ర‌మే ఈ అప్లికేష‌న్‌ను అప్‌డేట్ చేసుకోగా.. తాజాగా ఈ ఫీచ‌ర్ అంద‌రు యూజ‌ర్లకు అందుబాటులో ఉంది.

అయితే.. గ‌తంలో వాట్స‌ప్ గోల్డ్ అంటూ వినియోగ‌దారుల‌ను బోల్తా కొట్టించి.. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వారి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను హ్యాక‌ర్లు లాగేసిన‌ట్లే.. ఇప్పుడు కూడా హ్యాకర్లు వాట్స‌ప్ వీడియో కాలింగ్ నకిలీ అప్లికేష‌న్ల‌పై దృష్టి పెట్టారు. వాట్స‌ప్ లో ఈ ఫీచర్ ని డౌన్‌లోడ్ చేసుకోండంటూ హ్యాక‌ర్లు ప‌లు లింకులు పంపిస్తున్నారని..


ఈ మోసపూరిత లింక్స్ గురించి తెలియ‌ని యూజ‌ర్లు వాటిని అత్య‌ధికంగా షేర్ చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే.. ఈ లింకుల‌పై క్లిక్ చేస్తే వినియోగ‌దారులు త‌మ‌ వాట్సప్ అకౌంట్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళుతుంది. ఇటువంటి లింకుల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని..

కేవలం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మాత్రమే అప్లికేషన్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. వాట్సప్ లోకి అందుబాటులోకి వచ్చిన వీడియో కాలింగ్ స‌దుపాయంపై ప‌లువురు యూజర్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీడియో క్వాలిటీ బాగోలేక‌పోవ‌డంతో పాటు.. ఎక్కువ డేటా ని లాగుతుందని వాపోతున్నారు.

Readఈ ఒక్కటి వాసన చూపిస్తే ఆడవాళ్ళలో శృంగార కోరికలు రెట్టింపవుతాయట
Readమగాడికి ఇలా చేస్తే స్వర్గం చూపిస్తాడు
Readచద్ది అన్నం గురించి తెలిస్తే దోస ..ఇడ్లీ లు మానేస్తారు