News and Entertainment

కార్తీకమాసంలో మీరు చెయ్యకూడని 10 పనులు.. తప్పక తెలుసుకోండి..



కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికి తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పుజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విదిగా చేస్తారు. కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక ‘కార్తిక దామోదర అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా ‘ఆకాశదీపం పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఈమాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం

1.తామసం కలిగించే ఉల్లి తినకూడదు.
2.వెల్లుల్లి తినకూడదు.
3.మద్యం, మాంసం జోలికి పోకూడదు.
4.ఎవ్వరికి ద్రోహం చెయ్యరాదు.
5.పాపపు ఆలోచనలు చేయకూడదు.
6.దైవ దూషణ చేయకూడదు. 7.దీపారాదనకు తప్ప నువ్వులనూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు.
8.మినుములు తినకూడదు.
9.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
10.కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.

చెయ్యవలసిన పనులు:
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి.
ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం.
శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి.

కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.