News and Entertainment

షాకింగ్: పేస్ బుక్ అధినేత ని చంపేశారు...



ఫేస్‌ బుక్‌ సిబ్బంది పెద్ద తప్పు చేసి తర్వాత నాలుక్కరుచుకున్నారు. భారీ సంఖ్యలో ఫేస్‌ బుక్‌ యూజర్లు చనిపోయినట్టు శుక్రవారం పొరపాటుగా నిర్ధారించారు. వీరిలో ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జూకర్‌ బర్గ్‌ పేరు కూడా ఉంది. పొరపాటు తెలుసుకున్న ఫేస్‌ బుక్‌ యాజమాన్యం యూజర్లకు క్షమాపణలు చెప్పింది.

చనిపోయిన వారి స్మారక ప్రొఫైల్స్‌ను ఇతర ఎకౌంట్లలో పోస్ట్‌ చేశారు. వీటిని చూసి యూజర్లు అవాక్కయ్యారు. కొందరు నెటిజెన్లు ఫేస్‌ బుక్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫేస్‌ బుక్‌ యాజమాన‍్యం ఓ ప్రకటనలో క్షమాపణలు చెబుతూ..

పెద్ద తప్పు జరిగిందని, వీలైనంత త్వరగా దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. దాదాపు 20 లక్షల మెమోరియల్‌ ప్రొఫైల్స్‌ ను పోస్ట్‌ చేశారు.