News and Entertainment

కొత్త వేగంతో క్రోమ్‌ బ్రౌజర్‌ సిద్ధం...!



ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ నెట్ వినియోగం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో మనం ఇంటర్ నెట్ బ్రౌజ్ చేసుకోవాలంటే ఏదో ఒక బ్రౌజర్ తప్పనిసరి. గతంలో ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ లను ఈకువగా ఉపయోగించేవాళ్ళం. కాని గూగుల్ సంస్థ ప్రవేసపెట్టిన క్రోమ్ బ్రౌజర్ తో పరిస్థితి మారిపోయింది. ఎక్కువమంది ఈ బ్రౌజర్ వాడడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా క్రోమ్ బ్రౌజర్ వాడే వారికి శుభవార్త. కొత్త అప్డేట్ తీపి కబురు తీసుకొచ్చింది. పాత వర్షన్‌ కంటే వేగంగా పనిచేసేలా వర్షన్‌ 54ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ బ్రౌజర్‌ సెర్చ్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి రావడం.. అన్ని ఖాతాల నుంచి అనుసంధానం ఉండటం వంటి కారణాలతో దీనిపై ఆసక్తిచూపేవారి సంఖ్య నిత్యం పెరుగుతూ వస్తోంది. కొత్త అప్‌డేట్‌తో చాలా అంశాల్లో మెరుగ్గా ఉందని పేర్కొంది.

పేజీ లోడ్‌ వేగం 5.9 శాతం,
కొత్త ట్యాబ్‌ పేజీ లోడ్‌ వేగం 14.8 శాతం, స్టార్టప్‌ టైమ్‌ వేగం 16.8శాతం పెరిగినట్లు పేర్కొంది. దీనితోపాటు వినియోగ దారులు ప్రధానంగా ఎదొర్కుంటున్న భారీ ర్యామ్‌ యూసేజ్‌ కూడా తగ్గించేందుకు ఈ వర్షన్‌ బాగా ఉపయోగపడనుంది.
పేజీ లోడ్‌ వేగం 5.9 శాతం పెరిగింది
కొత్త ట్యాబ్‌ పేజీ లోడ్‌ వేగం 14.8 శాతం పెరిగింది
స్టార్టప్‌ టైమ్‌ వేగం 16.8 శాతం పెరిగింది
తర్వాతి లక్ష్యం ర్యామ్‌...

ప్రస్తుతం 54 వర్షన్‌ వేగంగా లోడ్‌ అవడంపై దృష్టి సారిస్తే తరవాతి వర్షన్‌ 55 ర్యామ్‌ వాడకం తగ్గించడమే లక్ష్యంగా సిద్ధం చేస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న వర్షన్‌ 53తో పోల్చితే దాదాపు 35 శాతం నుంచి 50 శాతం వరకు ర్యామ్‌ తక్కువ వాడుతుందని సంస్థ పేర్కొంది. దీన్ని డిసెంబర్‌ మొదటి వారంనాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. రాబోయే కొత్త వర్షన్‌ 55తో వీ8 జావాస్ర్కిప్ట్‌ ఇంజన్‌ను వాడనున్నారు