News and Entertainment

లైవ్‌లో షకీలా...ని పెట్టి సెక్స్ 'షో' బిజినెస్: ఫోర్న్ బెస్ట్... ఇంత దిగజారుడా...




టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కేవలం రెగ్యులర్ ,రొటీన్ వార్తలు,వాతావరణ విశేషాలతో రేటింగ్స్ రావు. ఏదో ఒక సంచలనం ఉండాలి...ఎప్పుడూ ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ ఉండాలి. అది ప్రతీసారి జరిగే పని కాదు. ఏ సెన్షేషన్ లేనప్పుడు మనమే దాన్ని క్రియేట్ చేయాలి అని నమ్ముతూంటారు టీవి ఛానెల్స్ లో పనిచేసే క్రియేటివ్ హెడ్స్. దాంతో వాళ్ళు రకరకాల ప్లాన్స్ వేస్తూంటారు. ఒక్కోసారి టీఆర్పీల కోసం దిగజారి అందరిచేతా తిట్లు కూడా తింటూంటారు. ఇప్పుడు అదే పరిస్దితి కొన్ని టీవి ఛానెల్స్ కు ఏర్పడుతోంది. వారు అతి తెలివితో చేస్తున్న పోగ్రామ్ లకు విమర్శలకు గురి అవుతున్నాయి.


జనాలు చూస్తున్నారు కాబట్టి ..వేస్తున్నాం అనే కాన్సెప్టుతో నడపబడుతున్న ఈ పోగ్రామ్ లకు వ్యూయర్ షిప్ బాగుంటోంది. ఓ ఛానెల్ ఉత్సాహంగా మొదలెట్టిన ఈ మసాలా పోగ్రామ్ మిగతా ఛానెల్స్ కు వైరల్ లాగ పాకింది. ఇప్పుడు మిగతా ఛానెల్స్ వాళ్లు కూడా ఇలాంటి పోగ్రామ్ లు వేయకపోతే మనుగడ కష్టం అని భావించే స్దితికి చేరారు. ఇంతకీ ఆ పోగ్రామ్ లు ఏమిటి..తమిళనాట భారీ చర్చకు దారి తీసి,త్వరలో తెలుగు టీవి ఛానెల్స్ కు పాకపోతున్న ఓ మిడ్ నైట్ మసాలా పోగ్రామ్ పై ప్రత్యేక కథనం.

ఫోర్నోగ్రఫిని మించిన
ఫోర్నోగ్రఫిని ఇండియాలో క్రైమ్ గా పరిగిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా మోరలిస్టిక్ పోర్నేగ్రఫీ గురించి విన్నారా. ఇప్పుడు కొన్ని తమిళ ఛానెల్స్ ఈ కొత్త ధీరిని కనుక్కున్నారు. తమ టీఆర్పీల కోసం. నీతి ముసుగులో సెక్స్ పోగ్రామ్ లు అందిస్తున్నాయి.

 
ఈ పోగ్రామ్స్ లో జరుగుతున్నది ఇదే
ఈ సెక్సాలజీ పోగ్రామ్స్ ని నడిపే యాంకర్స్ చాలా హాట్ గా ఉండేటట్లు చూస్తున్నారు. ఈ పోగ్రామ్ లో ఫొటోలే మీరు ఇక్కడ చూస్తున్నవి. వీటిలో డా.పళిని అనే సిద్ద డాక్టర్ కనపడి, జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూంటారు. అవన్నీ సెక్స్ రిలేటెడ్ గా ప్రవోక్ చేసేటట్లే ఉంటాయి.

 
సెక్స్ సమస్యలకు..
ఇక ఈ పోగ్రామ్స్ లో మరో అంశం ఏమిటి అంటే..జనాలు సెక్స్ సమస్యలకు, ఈ డాక్టర్ సలహాలు ఇస్తూంటారు. పోనీ ఈ డాక్టర్ మన సమరం గారిలా ఆ కోర్స్ చేసి, నైపుణ్యం సాధించినవాడా అంటే కాదు.