News and Entertainment

మీ దగ్గర రూ 500 నోటుందా...అయితే ఈ అమౌంట్ మీదే...!ప్రధాని నరేంద్ర మోడి పెద్ద నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించినప్పటి నుంచి రూ 500 నోటంటే ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఈ ప్రకటన రాకముందు ప్రతి ఒక్కరు తమ పర్సులో రూ 500 నోటు పెట్టుకొని తిరిగేవారు. ప్రస్తుతం ఈ నోట్లను మార్పిడి చేసేందుకు ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఈ నోట్లను తక్కువ విలువకు కూడా మార్చుకుంటున్నారు. కొన్ని షాపుల వాళ్ళు రూ 200 కొంటే రూ 500 తీసుకుంటామంటున్నారు. అయితే మీకిప్పుడు రూ 500 నోటు గురించి శుభవార్త.. మీ దగ్గర  2015 లో ముద్రించిన రూ 500 నోటుందా...అయితే దాన్ని అట్టే పెట్టండి.


2015 లో ఆర్ బి ఐ 3 మిలియన్ల 500 నోట్లను ముద్రించింది. ఆ నోట్లలో నంబర్ మొదట చిన్నగా ఉండి క్రమంగా పెద్దదవుతూ ఉంటుంది. అంతే కాకుండా ఈ నోటు చివర్లో 3 గీతాలు కూడా ఉంటాయి. అందుకే ఆ నోటుకు ప్రత్యేకత కలిగి పాతనోట్లను సేకరించే వ్యక్తులు ఈ నోట్లకు ఎక్కువ ధర చెల్లించి మరీ కొంటున్నారు. ఈ నోట్లపి ఒక ప్రముఖ పత్రిక కధనం రాసిన తరువాత ప్రజలు ఆ నోట్ల కోసం వెతికి మరీ చూస్తున్నారు. ఈ నోటు దొరికితే దానికి రూ 2000 చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఈ నోట్లు ప్రస్తుతం ఎక్కువగా కనిపించడం లేదు. మీ దగ్గర అటువంటి నోట్లున్నాయా..మరింకెందుకు ఆలస్యం.. వెంటనే అధిక ధరకు అమ్మేయండి.