News and Entertainment

ఇంటి గుమ్మం పై స్వస్తిక్ ముద్ర ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.. లేకపోతే సకల కష్టాలు తప్పవు..



స్వస్తిక్ గుర్తు అనేది లక్ష్మీదేవి చిహ్నం అలాగే స్వస్తిక్ ని మనం తులసి కోటా,దేవుడి గది, ఇలా వివిధ రకాలుగా రాస్తాము అయితే స్వస్తిక్ కనుక సరైన విధంగా వెయ్యకపోతే దారిద్ర దేవత రావడమే కాకా సకల కష్టాలు వస్తాయి.

ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు విజయం.. అదృష్టం రెండూ సొంతమవుతాయి. విఘ్నహర్త అయిన గణేశుడికి ప్రతీక అయిన ఈ చిహ్నం మీ ఇంట్లో ఉంటే చాలు.. ఇక ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు తలపెట్టిన పనులు జరిగిపోతుంటాయట… అందుచేత పురాతనకాలం నుంచి దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ చిహ్నం ఇంట్లో ఉంటే ఎలాంటి మంచి జరుగుతుందనేది శాస్త్రం చెపుతోంది…

ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగటం. పురాతనకాలంలో స్వస్తిక్ సూర్యపూజలకు చిహ్నంగా ఉండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగా చెపుతారు. తమ కుటుంబాలకు, వ్యాపారాలకు గణపతి కాపుగా ఉండాలని కోరుకునే వాళ్లు.. వ్యాపార ప్రాంతాలు, ఇళ్లలో ఈ స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటారు. కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించేప్పుడు, షష్టి పూజలు, వివాహాల సమయంలో ఈ స్వస్తిక్ ను గీస్తారు.


స్వస్తిక్.. ఎడమ నుంచి కుడివైపుకు తిరుగుతున్నట్లుగా కనిపిస్తూ, కాల చక్రంలా అనిపిస్తుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓంకు ఉన్న ప్రాధాన్యత స్వస్తిక్ కూడా ఉంది. ప్రత్యేక పూజల సమయంలో స్వస్తిక్ ముద్రను ఉపయోగిస్తారు. ఇంటి గుమ్మాలపైనా వీటిని గీస్తే వాస్తుపరమైన దోషాలు నివారించపడతాయట. స్వస్తిక్ ముద్ర సవ్యదిశలో ఉంటే అదృష్టం, విజయం వరిస్తాయట.. పొరపాటున అపసవ్వ దిశలో గీస్తే అన్నీ వ్యతిరేక పలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెపుతోంది. స్వస్తిక్ పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెస్తుంది. 13 వేల సంవత్సరాల చరిత్ర స్వస్తిక్ చిహ్నానికి ఉన్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది.