News and Entertainment

డిసెంబరు 3 తర్వాత జియో కొత్త సిమ్ కొన్నవారికి బంపర్ ఆఫర్...


జియో కోసం రిలయన్స్ షాపుల ముందు క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే సిమ్ పొందవచ్చు. అవును నిజమే. ఆన్ లైన్లో జియో సిమ్ కోసం పొందేలా ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించింది రిలయన్స్. ఈ పోర్టల్‌లో వినియోగదారులు వారి సమాచారాన్ని..
అడ్రస్ నమోదు చేస్తే వారం రోజుల్లో సిమ్‌ ఇంటికి వస్తుంది. ఈ స్కీమ్ జనవరి నుంచే అమల్లోకి వస్తోంది. ఈ పథకాన్నిముందుగా ముంబై, ఢిల్లీ , చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్, పుణె, బెంగుళూర్, హైదరాబాద్, వైజాగ్, చండీగఢ్, జైపూర్ లో ప్రారంభించనుంది రిలయన్స్.
హౌసింగ్ సొసైటీ వాళ్లు జియో ఆఫీసులకు వెల్లాల్సిన అవసరం లేకుండా ఒక డెస్క్ ను ఏర్పాటు చేసి సిమ్ లను పొందేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులు వెబ్ సైట్ లాగిన్ కావచ్చు లేదా 1-800-200-200-9 నెంబర్ కు మిస్ డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.
ఇంటికే జియో ప్రతినిధులు వచ్చి ఆధార్ కార్డు తో వెరిఫికేషన్ చేసుకుని 4G సిమ్ ను యాక్టివేట్ చేస్తారు. jio.com/en-in/register ద్వారా కూడా వినియోగదారులు సిమ్ కోసం వివరాలను నమోదు చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను మార్చి 2017 వరకు పొడిగించనుందంటూ గత కొంత కాలంగా అనేక రూమార్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 3వ తేదీ కంటే ముందు జియో 4జీ సిమ్‌ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే వెల్‌కమ్ ఆఫర్ వర్తిస్తుందని కొద్ది నెలల క్రితం జియో అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ తేదీ తరువాత జియో సిమ్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి అనే దాని పై మార్కెట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘వెల్‌కమ్ ఆఫర్ 2' పేరుతో జియో సరికొత్త ఆఫర్‌ను డిసెంబర్ 3వ తేదీన మార్కెట్లో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టెలికం ఆపరేటర్లు అందించే ప్రమోషనల్ ఆఫర్స్ కేవలం 90 రోజులు మాత్రమే వ్యాలిడిటీని కలిగి ఉండాలన్న ట్రాయ్ నిబంధనల నేపథ్యంలో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జియో ఆఫర్ చేయబోయే ‘వెల్‌కమ్ ఆఫర్ 2' కూడా 90 రోజుల వ్యాలిడిటీతో లభించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఏట్లాగైనా 100 మిలియన్ యూజర్లకు చేరువకావాలన్న సంకల్పంతో ఉన్న జియో, ఈ ఆఫర్‌ను మరింత విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

జియో లాంచ్ చేయబోయే ‘వెల్‌కమ్ ఆఫర్ 2' డిసెంబర్ 3 తరువాత జియో సిమ్‌ను కొనుగోలు చేసిన కొత్త కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట. సెప్టంబర్ 5న లాంచ్ చేసిన మొట్టమొదటి వెల్‌కమ్ ఆఫర్ ముందుగా ప్రకటించిన విధంగానే డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వీళ్లు జనవరి 1, 2017 నుంచి జియో అందుబాటులో ఉంచిన ఏదో ఒక ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది.