News and Entertainment

జియో వాడేవాళ్ళు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలంట... లేకపోతే అంతే...!!



జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్ కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. దీంతో జియో ఫ్రీ ఆఫర్ ను మార్చి వరకు పొడిగించింది. మరోవైపు జియో సిమ్ కార్డును సొంతం చేసుకోవడానికి వినియోగదారులు ఎగబడ్డారు. గంటల కొద్దీ క్యూలో కూడా నిలబడి జియో సిమ్ లను సొంతం చేసుకున్నారు..

శ్రమ పడిన తర్వాత జియో వినియోగదారులంతా ప్రస్తుతానికి వాయిస్ కాల్స్ ని, ఫ్రీ డేటాని ఎంజాయ్ చేస్తున్నారు.

నెట్ స్పీడ్ తక్కువగా ఉందని కాస్త బాధగా ఉన్నా త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సంస్థ ప్రకటించటంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. అయితే, జియో వినియోగదారులు ఓ విషయంలో కొంచెం కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారి ఆనందానికి తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉంది.

తమ పూర్తి వివరాలను కస్టమర్లు వెంటనే జియోకు అందించాల్సి ఉంటుంది. లేకపోతే జియో సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. అంతేకాదు, జియో కస్టమర్ల ఇన్ బాక్స్ కు ఓ వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది.
వెంటనే రిలయన్స్ షోరూంకు వెళ్లి ఫింగర్ ప్రింట్ వేయాలనేది ఆ మేసేజ్ సారాంశం. ఈ విషయంలో అశ్రద్ధ చేసినా జియో సేవలు ఆగిపోతాయి.