News and Entertainment

కార్తీక మాసంలో శివుడికి ఇదొక్కటి సమర్పిస్తే చాలు 1000 జన్మల పుణ్యం..


నందీశ్వరుడు, నటరాజ స్వామి, ముక్కంటి, త్రినేత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే మహా శివుడికి ఎన్నో పేర్లు అయితే పరమేశ్వరుడికి బోళ శంకరుడు అని కూడా పేరు ఉంది.

శివుడు నిష్కల్మషమైన భక్తిని కోరతాడు అనేది జగం ఎరిగిన సత్యం, మన భక్తిని చాటుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ,అందులో అభిషేకాలు, ఉపవాసాలు, దూప దీప నైవేద్యాలు, జాగరణలు ఇలా ఎన్నో అయితే శివుడికి ఇవ్వన్ని ఎంతో ఇష్టమైనవి అనేది వాస్తవం అయితే, మరి అన్నిటికన్నా శివుడు మెచ్చే నివేదన ఏమిటో తెలుసా?


శివుడు నిరాడంబరుడు అందుకే అయన కోరేది నీరు. అవును మీరు చదివింది నిజమే కార్తిక మాసంలో 
నిత్యం దీపం, నీరు ఆయనకి సమర్పిస్తే శివుడికి అనుగ్రహం పొంది కోరిన కోరికలు తీరుస్తాడు.

శివుని ఫోటో లేదా శివలింగం దగ్గర రాగి లేదా వెండి పాత్రలో శుభ్రమైన నీరు ఉంచాలి. అది రోజు పూజకు ముందు మార్చాలి. ఆ నిరుని మనం తీసుకోవచ్చు లేదా మొక్కలకు కూడా పోయచ్చు.