News and Entertainment

ఖైదీ నెం.150 ఆడియో డేట్‌..!



మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివి వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. మరి కొన్ని రోజుల్లో షూటింగ్‌ పూర్తి కాబోతుంది. ఇక ఈ సినిమా ఆడియో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ చిత్రం ఆడియోను విజయవాడలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియోను డిసెంబర్‌ 18న విడుదల చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘ధృవ’ సినిమాను వచ్చే నెల 9న విడుదల చేయబోతున్నారు. ‘ధృవ’ సినిమా సందడి పూర్తి అయిన తర్వాత చిరంజీవి 150వ సినిమా ఆడియోను విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ఆడియో విడుదల ఎక్కడ అనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. విజయవాడలో కంటే కూడా హైదరాబాద్‌లో అయితేనే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.