News and Entertainment

ఫస్ట్ నైట్ రోజు ఇలా చేస్తే లైఫ్ అంతా హ్యాపీ


నూతన వధూవరులు పెళ్లయ్యాక తమ కొత్త జీవితం ప్రారంభించాక మొదలయ్యే మొదటి రోజు. కావున నవ దంపతులు ఫస్ట్ నైట్ రోజు చాలా విషయాలు చర్చించుకుంటే వారి దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అయితే భార్యభర్తల మధ్య పెళ్లయ్యాక మొదటి మూడు రోజులు చాలా కీలకం.. ఈ మూడు రోజుల్లోనే వారి మధ్య అవగాహన లేకపోవడంతో మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ మూడు రోజుల్లో వారి మధ్య పెద్దగా అయ్యే ప్రమాదం ఉంది. మొదటి రోజు రాత్రి మాత్రం ప్రాధాన్యం ఎక్కువ ఉంది. ఆ రోజు జీవిత భాగస్వాములు ఇద్దరు మనసువిప్పి ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోని వారి ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోవాలి. 

మీరు ప్రారంభించబోయే జీవితం ఎలాగుండాలో చర్చించుకోవాలి. నీకుండే అలవాట్లను నిజాయితీగా తెలపాలి.. ముఖ్యంగా అప్పటివరకు మీ లైఫ్ స్టైల్, విధానం, పద్ధతి ఎలా ఉంటుందో ఆమెకు క్లుప్తంగా వివరించాలి. ఆర్థిక విషయాలతో పాటు ముఖ్యంగా వ్యాపార సంబంధమైన వాటి గురించి చెప్పుకోవాలి. ఇలా మీ భార్యతో దాపరికాలు లేకుండా చెప్పుకుంటే మీపై ఆమె ప్రేమ, నమ్మకం పెంచుకుంటుంది. అయినా ఇవన్నీ ఫస్ట్ నైట్ రోజు చర్చించేందుకు టైం ఎక్కడ ఉంటుంది.. ఆ రోజు కార్యకళాపాలు వేరుగా ఉంటాయి కదా అని మాత్రం ప్రశ్నించకండి...... అవి అవే...! ఇవి ఇవే.....! ఈ విషయాలు నీకు జీవితాంతం తోడ్పడుతాయని మాత్రం గుర్తుంచుకో. ఫస్ట్ నైట్ రోజు ఒకరినొకరు అర్థం చేసుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీగా సాగిపోతుంది.