News and Entertainment

అలా శోభనం అయ్యిందో లేదో తర్వాత ఆ పెళ్లి కూతురు ఏమి చేసిందో తెలిస్తే షాకే..



మనిషి జీవితం ఓ నాటకం అన్నారు పెద్దలు.. అయితే ఇక్కడ ఓ లేడీ కిలాడి చేసిన పనికి ఒక్క నిండు జీవితం బాలి అయింది .. పాత రోజుల్లో ఒక్క మంచి గుణాలు ఉన్న అల్లుడు వస్తే సరిపోతుంది అన్ని అనుకున్నారు .. కానీ ఈ రోజుల్లో ఒక్క మంచి గుణాలు ఉన్న అమ్మాయి వస్తే చాలు అనుకునే అంత వరకు వచ్చారు నేటి సమాజం లో ఉన్న తల్లి తండ్రులు.
పెళ్లితో తన లైఫ్ ఆనందోత్సాహాలతో నిండిపోతుందనుకున్నాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిర్మల్, తనకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో ని కలిసి పెళ్లి కోసం వధువు కావాలి అనగా తార అలియాస్ రుబీనా ని చూపించారు . తార అందానికి ఫిదా అయినా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిర్మల్ ఇంకా పెళ్లి పనులే తరువాయి అన్నట్టు అన్ని cచక చక జరిగిపోయాయి భవిష్యత్ అంతా భార్య ‘తార’తోనే అనుకున్నాడు. కానీ ప్రేమ పంచాల్సిన భార్య యమపాశమైంది. పెళ్లి జరిగిన మూడో రోజునే నిర్మల్ కు విషంపెట్టి చంపేసింది తార.

నగలు, డబ్బు తీసుకుని ఉడాయించింది. పెళ్లి ఆల్బమ్ నుంచి తార, ఆమె తల్లి ఫొటోలు తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ద్వారా తార గురించి విస్మయం కలిగించే విషయాలు తెలుసుకున్నారు. తార అసలు పేరు రుబీనా అని గుర్తించారు. ఆమెది లక్నో కాదని ఉత్తరాఖండ్ లోని కషిపుర్ లో నివసిస్తోందని సమాచారం అందుకున్నారు. ఇంతకీ తన పెళ్లి కి వచ్చిన తలిదండ్రులను మరియు కుటుంబ సభ్యులమని చెప్పుకున్న వారు అంతా డ్రామా ఆర్టిస్టులు అని దిమ్మ తిరిగే విషయం తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.


ఈ మాయలేడిని పట్టుకునేందుకు పోలీసులు తమదైన స్కెచ్ వేశారు. ఓ మధ్యవర్తి ద్వారా రుబీనా అలియాస్ తారకు పెళ్లి ప్రతిపాదన పంపారు. వీరి ప్రపోజల్ కు ఆమె ఓకే చెప్పింది, ఇంకా ఏమి ఉంది మళ్ళి అప్పటిలాగే తన డ్రామా ఆర్టిస్లు తో కలిసి మరో పెళ్లి కి వచ్చింది నిత్య పెళ్లి కూతురు దీంతో పోలీసుల్లో ఒకరు పెళ్లి కొడుకుగా మిగిలినవారు అతడి చుట్టాల అవతారమెత్తి ఈ కి’లేడి’ ఇంటికెళ్లారు. నిజంగా పెళ్లి బృందమే అనుకున్న రుబీనా మరియు తలిదండ్రులను మరియు కుటుంబ సభ్యులమని చెప్పుకున్న డ్రామా ఆర్టిస్టులు, ఆమెకి షాకిస్తూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రుబీనా ఇంతకుమునుపు కూడా అనేక పెళ్లిళ్లు చేసుకుని పలువురిని మోసగించినట్లు విచారణలో తేలింది.

విన్నారు కదా లోకం ఇలాగ తయారు అయింది పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకోవాలి అని అందుకే మన పెద్ద వారు అన్నారు ..