News and Entertainment

ఏటీఎం వద్ద క్యూలో నిలబడలేక పోతున్నారా.. అయితే ఇలా చెయ్యండి.



పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎం వద్ద క్యూలో నుంచో లేక.. మరో మార్గం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏటీఎం వద్ద క్యూలో నుంచోవడానికి సమయం లేని వారికి వారో మార్గం దొరికింది. ఇలాటి వారికి కొంత రుసుము చెల్లిస్తే.. మీ తరఫున ఎవరో ఒకరు వచ్చి ఏటీఎం దగ్గర క్యూలో నిలబడతారని ముందుకు వచ్చింది. దాని పేరు బుక్ మై ఛోటు.కామ్. గంటకు 90 రూపాయలు ఇస్తే చాలు. మీ తరఫున ఎవరో ఒకరు వచ్చి ఏటీఎం దగ్గర క్యూలో నిలబడతారు. కొత్త నోట్ల కోసం ఏటీఎం క్యూలో నిలబడుతున్న చాలామందిని ఈ కొత్త ఆలోచన ఆకట్టుకుంటుంది. అయితే..



ప్రస్తుతానికి ఈ వెబ్ సైట్ సేవలు ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో హెల్పర్‌ ను బుక్ చేసుకోవాలంటే ఆన్‌ లైన్‌ లో రిజిస్టర్ కావాలి.. లేదా 91-8587028869 నెంబరుకు ఫోన్ చేయాలి. ఛోటు అనే పేరు ఉన్నంత మాత్రాన చిన్న పిల్లలను ఎవరినీ తాము పనిలో పెట్టుకోవడం లేదని.. అంతా 18 ఏళ్ల పైబడినవారేనని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే.. కస్టమర్ల తరఫున బ్యాంకులోకి, ఏటీఎం కేంద్రంలోకి వెళ్లబోరని.. ఆ సమయానికి వాళ్లే రావల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఒక్క పని మాత్రమే కాదు ఇళ్లు మారాలన్నా, శుభ్రం చేసుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా, ఇంట్లో పార్టీలు ఉన్నప్పుడు సాయం కావాలన్నా.. ఇలా చాలా పనులకు ఈ హెల్పర్లను బుక్ చేసుకోవచ్చు. ఇది త్వరలోనే అన్ని ప్రాంతాల్లో బ్రాంచ్ లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.