News and Entertainment

తమన్నా ఒక్క రాత్రి ఖరీదు 1.2 కోట్లుటాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తమన్నా త్వరలో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాతో పాటు తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాలు చేస్తోంది. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న తమన్నా కొన్ని ప్రైవేట్‌ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంది. తమన్నా ఒక ఐటెం సాంగ్‌కు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందనే టాక్‌ ఉంది. ఆ మద్య ‘జాగ్వార్‌’ చిత్రానికి కోటి రూపాయల పారితోషికం అందుకుంది అని అంతా ప్రచారం జరిపారు. ఇక ఈ అమ్మడు ఒక్క రాత్రికిగాను 1.2 కోట్లు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.


కొత్త సంవత్సరంకు సెలబ్రెటీలు చాలా ఖరీదుగా వెల్‌కం చెబుతూ ఉంటారు. ఇక తమన్నా డిసెంబర్‌ 31 రాత్రికి 1.2 కోట్లు అందుకోబోతుంది. చెన్నైలోని ఒక ఈవెంట్‌ సంస్థ తమన్నాను ఇప్పటికే అడ్వాన్స్‌ ఇచ్చి బుక్‌ చేయడం జరిగింది. 31వ తేదీ సాయంత్రం 7 నుండి మద్యరాత్రి 12.30 నిమిషాల వరకు తమన్నా దాదాపు 10 పాటలకు డాన్స్‌ వేయబోతున్నట్లుగా ఈవెంట్‌ సంస్థ ప్రకటిస్తుంది. తమన్నా పాల్గొనబోతున్న ఈ కార్యక్రమంకు భారీగా జనాలు వస్తారనే నమ్మకంతో సదరు నిర్వహకులు ఉన్నారు.