News and Entertainment

2016 నవంబర్ 7వ తేది మహా పుణ్యమైన రోజు - కార్తీకమాసం కోటి సోమవారం


కార్తీకమాసంలో వచ్చే సప్తమీ + శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. ఆరోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు చేసిన ఫలితం వస్తుంది. అది ఈ సంవత్సరం అనగా 2016 నవంబర్ 7వ తేది వచ్చింది. అదృష్టం ఏమిటంటే సోమవారం కూడా కలిసి వచ్చింది.


 సప్తమి తిధి, శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న ఈ సోమవారం 7-11-2016 రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం శివుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండి దైవాన్ని కొలుస్తారు. కానీ ఈసారి కార్తీక మాసంలో వస్తున్న రెండవ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. సప్తమి తిధిలో, శ్రవణ నక్షత్రం రోజున సోమవారం రావాడం చాలా అరుదు. ఏంతో విశిష్ట ముహుర్తంలో వస్తున్న ఈ సోమవారాన్ని కోటి సోమవారాం అని కూడా అంటారు. ఆ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. అందుకే నవంబర్ 7 న  కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి

Readకార్తీకమాసానికి అయ్యప్ప దీక్షకి ఉన్న అద్బుతమైన అనుబంధం... ప్రతిఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు.
Readఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఇవి ఉంటే కచ్చితంగా సిరి సంపదలు మీ వెంటే
Readఈరోజు రాశిఫలాలు