News and Entertainment

రేప్ జరిగిన అమ్మాయిని అడగరాని ప్రశ్న అడిగిన పోలీసులు... అవమానంతో ఆ అమ్మాయి ఎం చేసిందంటే..



తిరువనంతపురం లో ఒక 35 ఏళ్ళ మహిళను తన భర్త స్నేహితులే సామూహిక అత్యాచారం చేసిన సంఘటన తెలిసిందే. అయితే ఈ సంఘటన పై సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో కామందుల పై పిర్యాదు చేసింది. ఇక్కడే బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీస్ లు వక్ర బుద్ది ప్రదర్శించారు. అత్యాచారానికి గురైన మహిళను పోలీస్ లు అడగరాని ప్రశ్న వేసి ఖాకీ దుస్తుల్లో మానవత్వం లేదని నిరూపించుకున్నారు.

బాధితురాలి స్నేహితురాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి పేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఓ పోలీసు అధికారి ఆ బాధితురాలిని అడిగిన ప్రశ్న హేయంగా ఉంది. " అత్యాచారం చేసిన నలుగురిలో ఎవరు నీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చారు?’’ అని ప్రశ్నించారట. ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అయింది.

దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం స్పందించింది. బాధ్యులపై చర్య తీసుకుంటామని ప్రకటించింది. బాధితురాలు తన భర్తతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్ళ బాధితురాలు మాట్లాడుతూ ‘‘నాకు పోలీసు దర్యాప్తు అక్కర్లేదు. ఎందుకంటే నన్ను పోలీసులు అవమానించారు.


నాపై జరిగిన అత్యాచారం కన్నా పోలీసుల బెదిరింపులు, అవమానకరమైన మాటలు భరించలేనివిగా ఉన్నాయి’’ అని వివరించారు. తిరువనంతపురానికి 280 కి.మీ. దూరంలో ఉన్న త్రిసూర్‌లో ఆ కుటుంబం ఉంటోంది. ఓ రోజు ఆమె భర్త స్నేహితులు నలుగురు వారి ఇంటికెళ్ళారు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేరు. వారిని నమ్మి, వారితోపాటు కారులో ఆమె వెళ్ళింది. నగరం బయటికి తీసుకెళ్ళి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సమాజం లో ఆడవారికి న్యాయం కలగడం లేదు. వెధవలు ఎక్కువైపోయారు. మనిషిలో ఆలోచన రావాలి.