News and Entertainment

వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన ప్రముఖ లేడీ న్యూస్ రీడర్...!


ఒక న్యూస్ రీడర్ ..రాత్రి 7 దాటితే టివి లలో తళుక్కుమంటుంది. న్యూస్ బులెటన్ అవగానే అసలు బులెటన్ మొదలవుతుంది. కదిరి పట్టణంలో కేడీ లేడీ యాంకర్ ఎవ్వారమిది. అనంతపురం జిల్లలో ఏ ఇద్దర్ని చూసినా ఇదే టాపిక్ గురించి డిస్కషన్. స్థానిక కేబుల్ టివిలో యాంకర్ గా పనిచేస్తున్న సల్మా పేదరికంలో మగ్గుతున్న రైతు కుటుంబంలోని అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుంటుంది. వారిని మచ్చిక చేసుకొని వ్యభిచారంలోకి దింపుతుందంటున్నారు  పోలీసులు. న్యూస్ రీడర్ గా బాగా సుపరిచితమయిన ఈ యాంకరమ్మ కు బడా రాజకీయనాయకులు, బంగారం వ్యాపారులు, చోటా మోటా లీడర్లతో మంచి సంబందాలున్నాయి.

వారిని ఎలా ఆకర్షించాలి, ఈ రూట్ లో వెళితే ఎవరెలా తొందరగా పడిపోతారో అనే విషయాలను బాగా స్టడీ చేసింది. అలా కొంతమందిని ఎంపిక చేసి ప్లాన్ అమలు చేస్తుంది. టార్గెట్ ఫిక్స్ అయితే సల్మా అప్రోచ్ డిఫరంట్ గా ఉంటుందట.. తన దగ్గరున్న అందమైన అమ్మాయిల ఫోటోలను, వీడియో క్లిప్పింగులను బడాబాబులకు పంపుతుంది. డీల్ సెట్ చేసి వాల్లిద్దర్రో కలుసుకున్న దృశ్యాలను సీక్రెట్ గా రికార్డ్ చేస్తుంది. తనకు అవసరమైనప్పుడు ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది.



తాజాగా సల్మా ట్రాప్ లో పడి మోసపోయిన  ఒక పేద యువతి తన భాదను లెటర్ రాసి ఇంట్లోనుంచి పారిపోవడంతో అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది. భాదితురాలి ఉత్తరంతో పోలీసులను ఆశ్రయించారు ఆమె తల్లిదండ్రులు. పారిపోయిన యువతి కాల్ డాటా ను పరిశీలించిన పోలీసులు సల్మా రైట్ హ్యాండ్ దాదూ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. దాదూ పోలీసు ఇంటరాగేషన్ లో సల్మా తో పాటు తమ వ్యాపారాన్ని మొత్తం బయట పెట్టేసాడు.

ఈ అమ్మాయి ఒక్కటే కాదని తమ దగ్గర ఇంకా 1500 మంది భాదితుల వీదియోలున్నాయని చెప్పడం తో షాక్ తిన్నారు పోలీసులు. సల్మా భాదితులలో బడా బడా రాజకీయ నాయకులు పై స్థాయి పోలీసు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకీ సల్మా వ్యవహారంపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు పోలీసులు. మొత్తమ్మీద సల్మా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.