News and Entertainment

రేప్ కు రేప్ శిక్ష అనే పంచాయితీ తీర్పు..



ప్రపంచ వ్యాప్తంగా ఆడవారి మీద అత్యాచారాలకు అంతేలేకుండా పోతుంటే.. సందట్లో సడేమియగా పంచాయతీ పెద్దలు ఇచ్చే దారుణమైన తీర్పులతో.. మరికొందరి ఆడవారి జీవితాలు నాశనం అవుతున్నాయి.. ముల్లుకు ముల్లు కన్నుకు కన్ను.. అత్యాచారానికి.. తిరిగి అత్యాచారం అనే విధంగా పంచాయితీ పెద్దల తీర్పుతో ఓ గర్భిణీ పై అత్యాచారానికి తెగబడ్డాడో ప్రభుద్దుడు… ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని ఆ మహిళ ఆత్మహత్య చేసుకొన్నది. సభ్య సమాజం తలదించుకొనేలా దారుణ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే…


పాకిస్తాన్ లోన్ ఈ పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో గుజరాత్ సిటీకి చెందిన ఓ వ్యక్తి… 16 ఏళ్ల యువతిని అత్యాచారం చేశాడు…  ఈ సంఘటనపై పంచాయితీ పెద్దలు విచారణ జరిపి.. రేప్ చేసినందుకు నిండుతుడికి శిక్షగా… ఆ నిందితుడి కూతురుపై అత్యాచారం చేయాలని తీర్పు చెప్పారు… కాగా నిందితుడి కూతురుకి అప్పటికే పెళ్లై.. గర్భవతి కూడా… కానీ పంచాయితీ తీర్పుతో గర్భవతి అని కూడా చూడకుండా… 16 ఏళ్ల బాలిక కు చెందిన వ్యక్తి.. అత్యాచారం చేశాడు.. దీంతో ఆ గర్భవతి అవమానంగా భావించి శరీరాన్ని కాల్చుకొన్నది. తీవ్రంగా గాయపడ్డ ఆ గర్భిణీని.. లాహోర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ.. మృతి చెందింది… కాగా మరణ వాంగ్మూలంలో తనపై పంచాయితీ పెద్ద తీర్పుతోనే రేప్ చేశాడని చెప్పింది… గర్భిణీ భర్త పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి నిరాకరించడమే కాదు… తనకు అల్లానే న్యాయం చేస్తాడని చెప్పాడు..