News and Entertainment

కార్తీకమాసానికి అయ్యప్ప దీక్షకి ఉన్న అద్బుతమైన అనుబంధం... ప్రతిఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు.కార్తీక మాసం మొదలుకుని 41 రోజుల పాటు ఆలయాల్లో నిత్యం ఆధ్యాత్మిక శోభ ఉంటుంది. దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గం దిశగా పయనించడానికి కార్తీకమాసం వారధిగా నిలుస్తోంది.కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్పస్వామి దీక్ష తీసుకుంటారు. సాధారణంగా రోజూ ఇంట్లోనో, ఆలయాల్లోనో దైవ నామస్మరణ, పూజలు చేస్తుంటాం.
వాటన్నింటికీ భిన్నంగా అయ్యప్ప దీక్ష నియంత్రణాత్మ, ఆధ్యాత్మిక సోపానంగా భావిస్తూ పలువురు దీక్షబూనుతారు. కాలక్రమేణా ఇదే రీతిలో భవానీ, శివ, హనుమాన్‌, సాయి దీక్షలు ఏర్పడ్డాయి. వస్త్రాల రంగుల్లో మార్పులున్నా దాదాపు అందరి నియమాలు నిష్టలూ ఒక్కటే. క్రమ పద్ధతిలో మండలం రోజులు జీవన యాణం సాగిస్తారు.
దీక్షల సమయంలో ఉదయం, సాయంత్రం నియమాలు పాటిస్తారు. బాహ్య ప్రపంచాన్ని, ఒత్తిడిని ప్రతిరోజూ రెండు గంటల సేపు మరిచిపోతారు. వీటి వెనుక ఆధ్యాత్మిక, తాత్విక, సైన్సు కోణాలు దాగుండడం విశేషం. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఆ నియమాల అంతర్యమేమిటో చూద్దామా..!! **శిరస్నానం
*ఆధ్యాత్మికం : అభ్యంగస్నానం దేవునికి ప్రీతి కరం.
*తాత్వికం : మనుసుకు హాయినిస్తుంది. చెడు భావాలను దూరం చేస్తుంది. లక్ష్యం (దైవం)పై ఏకాగ్రత కుదురుతుంది.
*వైజ్ఞానికం : శిరోభాగం (మెదడు) ఆలోచనలకు కేంద్ర బింధువు. అంటే క్రియ (పని) చేస్తుంది. క్రియ ఉన్న ప్రతిచోట ఘర్షణ (రాపిడి) ఉంటుంది. దీని వల్ల ఉష్ణం ఏర్పడుతుంది. అధిక ఉష్ణం ఆరోగ్యానికి నష్ట దాయకం. చన్నీళ్లు ఆ ఉష్ణాన్ని ఉపశమింపజేస్తుంది.
**చందనం ఆరోగ్యదాయకం
*ఆధ్యాత్మికం : నుదురు దైవస్థానం. భృకుటి స్థానంలో పెట్టుకునే నామం దైవానికి ఎంతో ఇష్టం.
*తాత్వికం : రెండు కనుబొమ్మల మధ్యన నుదుటిభాగం యోగ రీత్యా విశిష్టమైంది. పాలభాగంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. తాత్వికుల భావన. దానికి అనుగుణంగా అక్కడ కుంకుమ, విభూది, గంధం, చెందనాల్లో ఏదో ఒక్కటి పెట్టుకుంటారు.
*వైజ్ఞానికం : నాడీ మండలానికి కేంద్రం నుదుటిభాగం. అక్కడ సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయకం.


**వస్త్రధారణ
*ఆధ్యాత్మికం : అయ్యప్ప భక్తులు నల్లటి వస్త్రాలు ధరిస్తారు. ఈ దుస్తులు ధరించిన వారిపై శని దేవుని చూపు పడదని భక్తుల విశ్వాసం.
*తాత్వికం : నలుపు ఆకర్షనలకు దూరంగా ఉండి అన్ని ఇహ పర సుఖాలను తృజించమని చెబుతుంది.
*వైజ్ఞానికం : నలుపు రంగుకు ఉష్ణాన్ని గ్రహంచే శక్తి ఉంటుంది. దేహ ఉష్ణోగ్రతను దీక్ష ఉపవాసాలు తగ్గిం చేస్తాయి. ఈ దుస్తులు ఉష్ణాన్ని సమతుల్యం చేస్తాయి.
**మితాహారం.. కొవ్వు దూరం
*ఆధ్యాత్మికం : మితాహారమే ఆరోగ్యం.. మితాహారం తీసుకోవడం ద్వారా కొవ్వు శరీరంలో చేరేందుకు ఆస్కారం ఉండదు.
*తాత్వికం : ఒక్కపూట భోజనం రెండు పూటలు అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఎలాంటి బద్దకం లేకుండా రెట్టింపైన ఉత్సాహంతో పరుగెట్టేందుకు వీలుంటుంది.
*వైజ్ఞానికం : మితాహారం తీసుకోవడం వల్ల మధుమేహం దూరం అవడమే కాకుండా మాంసాహారం లాంటి భయంకరమైన కొవ్వు పదార్థాల నుంచి గుండెను కాపాడుకోవచ్చు.