News and Entertainment

ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేసిన రామ్ చరణ్...!ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ వసూళ్ళలో మూడవ అతి పెద్ద సినిమాగా నిలిచింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరో నెలన్నరలో ఈ ఏడాది పూర్తవుతుంది. ఈ కొద్ది సమయంలో జనతా గ్యారేజ్ రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదైనా వస్తుందా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న(25-11-2016) విడుదలయిన ధృవ ట్రైలర్ కొద్ది సమయంలోనే జనతా గ్యారేజ్  రికార్డును బ్రేక్ చేసింది.


ధృవ ట్రైలర్ విడుదలయిన నాలుగున్నర గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. జనత గ్యారేజ్ ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ సాదించడానికి పదిన్నర గంటల సమయం పట్టింది. జనత గ్యారేజ్ ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ రికార్డును ధృవ బ్రేక్ చేయడంతో, ఇప్పుడు ధృవ కలక్షన్స్ కూడా రికార్డులు సృష్టిస్తుంది అని మెగా అభిమానులు అంచనా వేస్తున్నారు. గ్యారేజ్ మొత్తంగా రూ 83 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పుడు చరణ్ ధృవ ఈ రేంజ్‌లో క‌లెక్ష‌న్ సాధిస్తుందా? లేదా చూడాలి. ఏదేమైనా ధృవ ట్రైల‌ర్‌కు వ‌స్తోన్న రెస్పాన్స్ సినిమా మీద అంచ‌నాలు సైతం భారీగా పెంచేసింది.