News and Entertainment

షాకిచ్చిన అంబాని.. మరో సంచలన ప్రకటన.. సామాన్యులకు పండగే


ఒక్కసారిగా అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను అందిస్తామని ప్రకటించి, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ అనే ఒకేఒక్క ప్రకటనతో టెలికామ్ కంపెనీలకు షాకిచ్చిన జియో మరో సంచలనానికి తెరలేపబోతుందని టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇంతకు ముందు ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ఆఫర్స్ తో సామాన్య ప్రజలను టార్గెట్ చేసిన ముఖేష్ అంబాని ఈ సారి మధ్యతరగతి కుటుంబాలను కూడా ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రెండు నెలల క్రితం టెలికం మార్కెట్లోకి అడుగుపెట్టి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోన్న రిలయన్స్ జియో త్వరలోనే డిజిటల్ టీవీ ప్రసార సర్వీసులను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. జియో ఆఫర్ చేయబోతున్న DTH సర్వీసులు అత్యంత చౌక ధరల్లో అందబాటులో ఉంటాయని సమచారం.
అయితే ఇప్పటికే ఉన్న ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశముందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదేగానీ జరిగితే


డీటీహెచ్ రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు అందించే నెలవారీ డీటీహెచ్ ప్యాక్‌ను ముఖేష్ అంబానీ 185 రూపాయలకే అందించాలని భావిస్తున్నారట. అయితే ఈ రిలయన్స్ జియో డీటీహెచ్ సర్వీస్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.