News and Entertainment

ప్రశ్న / సమాధానం : ఇంట్లో ఎందరున్నా సెక్స్‌ కావాంటాడు



ప్రశ్న : మా పెళ్లి అయ్యి రెండున్నర సంవత్సరాలు అయ్యింది. ఇంకా పిల్లలు కాలేదు. మా వారితో సంసార జీవితం సాఫీగా సాగుతుంది. ఆయన శృంగారంలో నన్ను ప్రతి రోజు కూడా సంతృప్తి పర్చుతూ ఉంటాడు. అయితే ఆయనతో నాకు ఒకే ఒక్క పెద్ద సమస్య ఉంది. మేము ఉండేది హైదరాబాద్‌లో. ఆర్థిక పరిస్థితుల కారణంగా రెండు రూముల పోర్షన్‌ను అద్దెకు తీసుకున్నాం. అప్పుడప్పుడు మమ్ముల చూసేందుకు బందువులు వస్తూ ఉంటారు. వారు కొన్ని సమయాల్లో రాత్రి ఉండి పోతూ ఉంటారు. వారు ఉన్నది కూడా చూడకుండా మద్యరాత్రి సమయంలో పక్క గదికి రమ్మని గొడవ చేస్తారు. రాకుంటే బలవంతం చేస్తారు. రెండవ రూం కిచెన్‌. అందులో శృంగారం చేస్తాడు. రాత్రి సమయంలో ఎవరైనా ఉన్న సమయంలో శృంగారం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కాని ఆయనకు మాత్రం ఆరోజు కూడా శృంగారం కావాలి. ఆయన పద్దతిని ఎలా మార్చాలి? అన్ని మంచిగా ఉన్న ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? దీనికి పరిష్కారం ఏంటి?(సుప్రియ, హైదరాబాద్‌)


సమాధానం : పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యింది కనుక శృంగారంపై ఇంకా మక్కువ మీ ఆయనకు పోయి ఉండదు. అందుకే ప్రతి రోజు శృంగారం కోరుకుంటూ ఉంటాడు. మీ ఆయన మీపై ప్రేమను కురిపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. బందువులు వచ్చిన సమయంలో శృంగారం వద్దు అని మీరు ముందే చెప్పండి. అంతకు ఆయన ఒప్పుకోని పరిస్థితుల్లో మీరు ఇల్లు మారడం ఉత్తం. బెడ్‌ రూం మరియు హాలు ఉన్న ఇంటిని తీసుసుకుని, బందువులను హాలులో పడుకోమని, మీరు నిర్మొహమాటంగా బెడ్‌ రూంలో దూరడం ఉత్తమం. (మానసిక వైధ్య నిపుణుడు)