News and Entertainment

సాహసం శ్వాస‌గా సాగిపో - రివ్యూమూవీ.. సాహ‌సం శ్వాసగా సాగిపో
న‌టీన‌టులు.. నాగ‌చైత‌న్య‌, మంజిమా మోహ‌న్‌, బాబా సెహ్‌గ‌ల్‌
మ్యూజిక్‌.. ఏఆర్ రెహ‌మాన్‌
నిర్మాత‌..ర‌వీంద‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం.. గౌత‌మ్ మీన‌న్‌

ఏమాయ చేశావే వంటి సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన రెండో మూవీ ఇది. ఆ సినిమాకి కాస్త భిన్నంగా ఇందులో రొమాన్స్‌తోపాటు యాక్ష‌న్ కూడా మిక్స్ చేశాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌. గ‌త ఆరు నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోన్న ఈ సినిమా తాజాగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఎన్నో ఒడిదుడుకులు త‌ట్టుకొని విడుద‌లయిన ఈ సినిమా ఎలా ఉందో ఒక‌సారి చెక్ చేద్దాం..

క‌థ‌..
లీలా స‌త్య‌మూర్తి.. (మంజిమా మోహ‌న్‌) అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. మ‌హారాష్ట్ర‌లో నివసిస్తున్న ఆమె తన ఫ్రెండ్‌ని క‌ల‌వ‌డానికి వైజాగ్ వ‌స్తుంది. ఆ ఫ్రెండ్ బ్ర‌ద‌రే నాగ‌చైత‌న్య‌. ఎమ్‌బీఏ చ‌దువుతున్న ర‌జ‌నీకాంత్ (నాగ‌చైత‌న్య) ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు న‌చ్చ‌డంతో ఆమె ల‌వ్‌లో ప‌డుతుంది. ఇద్ద‌రూ క‌లిసి ఊటీ బ‌య‌ల్దేర‌తారు. కానీ, ప్ర‌యాణం మ‌ధ్య‌లో ఇద్ద‌రికీ యాక్సిడెంట్ అవుతుంది. అదే రోజు మ‌హారాష్ట్రలో నివ‌సిస్తున్న లీలా వారి పేరెంట్స్‌పైనా దాడి జ‌రుగుతుంది. ఈ రెండు సంఘ‌ట‌న‌ల‌కు లింక్ ఉందా.. ? ఉంటే ఎవ‌రు చేశారు..? దానిని నాగ‌చైత‌న్య ఎలా ఫేస్ చేశాడు..? ఇదీ క‌థ‌..

క‌థ‌నం..
ఇది ప‌క్కా గౌత‌మ్ మీన‌న్ సినిమాలా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ల‌వ్ ట్రాక్‌ని చాలా నాచుర‌ల్‌గా డెవ‌లప్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇద్ద‌రి మ‌ధ్య సీన్‌లు కూడా క‌ట్టిప‌డేసేలా చేశాడు. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంటర్‌ట‌యిన‌ర్‌గా తీర్చిదిద్దేలా ప్లాన్ చేశాడు ఈ మూవీని. పాట‌లు, బిట్ సాంగ్స్‌తోపాటు మాంటేజ్ సాంగ్స్‌తో సినిమాలో కాస్త పాట‌లు బోర్ కొట్టించేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్‌గా సాగిపోతుంది. కానీ, రొమాంటిక్ సీన్‌లను తెర‌కెక్కించ‌డంలో గౌత‌మ్ మీన‌న్‌ది స్పెష‌ల్ హ్యాండ్‌. అందుకే,ఆ సీన్‌లు కాస్త ఫ్రెష్‌గా క‌నిపిస్తాయి.

సెకండ్ హాఫ్ మొత్తం యాక్ష‌న్ సీన్‌ల‌తో న‌డుస్తుంది క‌థ‌. అంతే, అక్క‌డినుంచి సినిమా పూర్తిగా ప‌ట్టాలు త‌ప్పుతుంది. ఆ త‌ర్వాత క‌థ‌, క‌థ‌నం అంతా అయోమ‌యంగా తయార‌వుతుంది. ఇదే సినిమాకి అస‌లు మైన‌స్‌. రొమాంటిక్ సీన్‌ల‌ను పండించ‌డంతో చైతు ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకున్నాడు. ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు చాలా కూల్‌గా క‌నిపించాడు. సెకండాఫ్‌లో కాస్త ఇబ్బందిప‌డ్డ‌ట్లు క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడికే క‌థ‌పై ప‌ట్టు లేక‌పోవ‌డం కూడా స‌గం కార‌ణం. ఇక‌, విల‌న్‌గా పాప్ సింగర్ బాబా సెహ్‌గ‌ల్ బాగా చేశాడు. ఆయ‌న‌తో మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టాడు గౌత‌మ్ మీన‌న్‌.

కేర‌ళ లొకేష‌న్‌ల‌లో తీసిన సీన్‌లు చూడ‌డానికి చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బావుంది. స్లో నారేష‌న్ సినిమాకి బిగ్ మైన‌స్‌. గౌత‌మ్ మీన‌న్ సినిమాల‌లో లాగ్ కామ‌న్ అయిన‌ప్ప‌టికీ, సాహ‌సంలో అది ప‌రిమితిని దాటింది. దీంతో, చాలా చోట్ల బోర్ కొట్టిన‌ట్లు ఫీల‌వుతాడు ప్రేక్ష‌కుడు.

బాట‌మ్‌లైన్‌.. ఆ స్లో నారేష‌న్‌ని భ‌రించ‌డానికి చాలా సాహ‌సం కావాలి.


రేటింగ్.. 2.0/5