News and Entertainment

సమంత, నాగ చైతన్య రొమాంటిక్ గా ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా!



సమంత, నాగ చైతన్య ల ప్రేమాయణంపై కొన్నాళ్ళు సస్పెన్స్ నెలకొన్నా, వీరిద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు అనే విషయంపై అభిమానులలో పూర్తి క్లారిటీ ఉంది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. చైతూ ఇటీవల సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక సమంత తమిళ హీరో విశాల్ తో తప్ప మరే మూవీకి కమిట్ కాలేదు. అయితే ఈ జంట సమయం దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సమంత తన ఇన్ స్ట్రాగ్రామ్ లో చైతూతో కలిసి ఉన్న ఓ పిక్ ని షేర్ చేసింది.


ఎంతో రొమాంటిక్ గా ఉన్న ఈ పిక్ ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, వన్ ఆఫ్ ది క్యూట్ పెయిర్ అని కొందరు కామెంట్స్ పెడుతుంటే మరి కొందరు మీ పెళ్ళి కబురు తొందరగా చెప్పండంటూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ రోజు చైతూ బర్త్ డే. ఈ క్రమంలో వీరిద్దరు గోవా వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి అక్కడి పిక్స్ ని సమంత షేర్ చేస్తుందేమో చూడాలి.